మ‌రో క్రేజీ ప్రాజెక్టుకు ప్ర‌భాస్ గ్రీన్‌సిగ్న‌ల్‌... పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌తో ఫిక్స్‌.. ?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

ఆల్ ఇండియా స్టార్ .. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా సలార్ - కల్కి లాంటి రెండు పాన్ ఇండియా సూపర్ డూపర్ హిట్ సినిమాల తో ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వం లో ది రాజా సాబ్‌ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరో డైరెక్టర్ హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా లో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్‌ సినిమా లో కూడా  నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే మ‌న యంగ్ రెబ‌ల్ స్టార్‌ ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్ట్‌ని ఓకే చేసినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్ట‌ర్ కూడా పాన్ ఇండియా డైరెక్ట‌ర్ కావ‌డం విశేషం. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో ?  కాదు టాలీవుడ్‌లో ‘ హనుమాన్ ’ సినిమా తో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ మార్క్ సెట్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ కావ‌డం విశేషం. ప్ర‌శాంత్ వ‌ర్మ రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ తనయుడు నంద‌మూరి మోక్షజ్ఞతో .. అత‌డి డెబ్యూ సినిమాను అనౌన్స్ చేశాడు.

కార‌ణాలు ఏవైనా ఈ ప్రాజెక్టు హోల్డ్ అయ్యింద‌ని గుస‌గుస లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీ ని ప్రభాస్‌తో చేసేందుకు సిద్ధమవుతున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ వ‌ర్మ చెప్పిన క‌థ ప్ర‌భాస్‌కు న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చేశాడ‌ని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే అనౌన్స్ చేయాలని చూస్తున్నార‌ట‌. సంక్రాంతి కి కాస్త ముందు లేదా ఆ త‌ర్వాత ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని భోగ‌ట్టా .. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: