ప్ర‌జారాజ్యం బాట‌లోనే జ‌న‌సేనా... అన్న త‌ప్పులే తమ్ముడు రిపీట్‌... !

Amruth kumar
అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం బాటలోనే తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా వెళుతుందా ? అన్న చిరంజీవి చేసిన తప్పులే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడా ? అంటే అవుననే చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అది కాపులు పార్టీ అనే విమర్శ వచ్చేసింది. చిరంజీవి కూడా 100కు పైగా సీట్లు బీసీలకు ఇచ్చాను అని చెప్పుకున్న .. మిగిలిన జనరల్ సీట్లు ఎక్కువగా కాపు సామాజిక‌ వర్గానికి కేటాయించారు. ఆ మాటకు వస్తే ప్రజారాజ్యం నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలలో చాలామంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. చివరకు ప్రజారాజ్యం కుల‌ పార్టీగా ముద్ర వేసుకుంది. చిరంజీవి ఆ పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారు. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చింది.. అంతవరకు బాగానే ఉంది.

అయితే జ‌న‌సేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యే ల‌లో కూడా 12 మంది కాపులే ఉన్నారు. ఆ పార్టీ నుంచి కొద్ది రోజుల క్రితం ఫ‌స్ట్ ఎమ్మెల్సీ అయిన వ్య‌క్తి కూడా అదే సామాజిక వ‌ర్గం. ఇక జ‌న‌సేన నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎంపీలు మ‌చిలీప‌ట్నం వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి తో పాటు కాకినాడ నుంచి గెలిచిన టీ టైం ఉద‌య్ శ్రీనివాస్ ఇద్ద‌రూ కూడా కాపులే. ఇక జ‌న‌సేన ఇచ్చిన ముగ్గురు మంత్రి ప‌ద‌వుల‌లో పార్టీ అధినేత .. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాపు నేత‌.. మ‌రో మంత్రి కందుల దుర్గేష్ కాపు వ‌ర్గానికే చెందిన వారు. ఇక మ‌రో మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ క‌మ్మ నేత‌. అయితే ఇప్పుడు ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబుకు కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ఫిక్స్ అయ్యింది. నాగ‌బాబు కూడా కాపే. ఏది ఏమైనా ప్ర‌జారాజ్యం పార్టీ కి కాపు పార్టీ గా ఎలా అయితే ముద్ర ప‌డిందో.. ఇప్పుడు జ‌న‌సేన పై కూడా అదే ముద్ర ప‌డిపోయే ప్ర‌మాదం అయితే స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: