బీజేపీ ఎమ్మెల్యే : 2 ఎకరాల చంద్రబాబుకు.. హెరిటేజ్ ఎలా వచ్చింది ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తెలంగాణ బిజెపి పార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు... అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు ఆర్మూరు బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల గురించి మాట్లాడారు బిజెపి ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్నకు రెండు ఎకరాల ఆస్తి ఉండేదని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వేలాది  ఎకరాలు సంపాదించాడని ఆరోపణలు చేశారు బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడుకు.... వేలాది ఎకరాల హెరిటేజ్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. ఇది ఎవరు ఎందుకు అడగరని ఆయన ప్రశ్నించారు. దీనిపై అనేక సందేహాలు ఉన్నాయని కూడా బిజెపి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొనడం జరిగింది.
 అయితే చంద్రబాబు నాయుడు పైన కామెంట్స్ చేసిన పైడి రాకేష్ రెడ్డి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా పైన కూడా కామెంట్ చేయడం జరిగింది.  అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయకూడదని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాలో హీరోగా చేసిన అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పైడి రాకేష్ రెడ్డి.
 పుష్ప మొదటి భాగంలో ఎర్రచందనం 10 లక్షల రూపాయలు ఉంటే కోటి రూపాయలుగా చూపించాలని మండిపడ్డారు. ఆ సినిమాలో చూపించిందంతా బూటకమే అని నిప్పులు చెరిగారు.అయితే ఆ సినిమా చూసి యువత పాడైపోయిందని... ఇప్పటికే చాలామంది చెట్లను నరికేసారని ఆగ్రహించారు.  ఇప్పుడు పుష్ప పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నారు... ఈ సినిమా చూసి యువత మరింత చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఆ సినిమా రిలీజ్ కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: