బ్రేకింగ్‌: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే మృతి

RAMAKRISHNA S.S.
- ( ద‌క్షిణి తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )  . .
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మంచి జోష్లా ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు మాజీ మంత్రులు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు. కొద్దిరోజుల క్రితం విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పార్టీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఇప్పుడు మరో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు. ఆయన ఎవరో కాదు ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊరకే అబ్బయ్య ( 70 ) మృతి చెందారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత కొద్ది నెలలుగా చికిత్స తీసుకుంటున్నారు. హైదరాబాదులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఊకే అబ్బయ్య తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. ఆయ‌న మామూలు కార్య‌క‌ర్త‌ స్థాయి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచే స్థాయి వరకు ఎదిగారు. ఎన్టీఆర్ .. చంద్రబాబుకు ఆయన అత్యంత ఇష్టుడిగా పేరు పొందారు. అబ్బ‌య్య ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్లో బూర్గంపాడు నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికలలో 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఆయ‌న సీపీఐ నుంచి గెలిచారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అబ్బయ్యకు తిరిగి 1994 వరకు మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం రాలేదు. ఆయన తొలిసారి బూర్గంపాడు ఎస్టి రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించగా... 1994 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన నియోజకవర్గం మారారు, ఇల్లెందు నుంచి రెండోసారి సీపీఐ త‌ర‌పున‌ ఎమ్మెల్యేగా గెలిచారు.

1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అబ్బాయిలకు మళ్లీ 15 సంవత్సరాలకు గాని అవకాశం రాలేదు. 2009లో ఆయన ఇల్లెందు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా .. తెలుగుదేశం త‌ర‌పున‌ విజయం సాధించారు. అలా ఆయన తన కెరీర్ లో మొత్తం మూడుసార్లు రెండు పార్టీల‌ తరఫున ... రెండు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా సరైన అవకాశాలు రాలేదు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: