మూసీ పేరిట, హైడ్రా పేరిట కేవలం అమాయక పేద ప్రజలను బలి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటివరకు జల వనరులను అన్యాక్రాంతం చేసిన ఏ ఒక్క ఫాం హౌజ్‌ను రేవంత్ సర్కార్ ఎందుకు కూల్చలేదన్నారు. దేశంలో రెండు రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందని, ఇక్కడ సంపాదించిన డబ్బులను ఇతర రాష్ర్టాల్లో అధికారం కోసం ఖర్చు పెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు. నిపుణుల పర్యవేక్షణలోనే మూసీ పునరుజ్జీవం జరుగుతుందంటున్న రేవంత్ రెడ్డి, ఆ నిపుణుల జాబితాను బయటపెట్టాలన్నారు.మూసీ వెంబడి 2005లోనే పాదయాత్ర చేసి, కాలుష్య వ్యర్థాలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని పృథ్వీరాజ్ గుర్తు చేశారు. మూసీ వెంబడి భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడం కంటే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధానాలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. పునరావాసం కల్పించకుండా, కేవలం పేదల నివాసాలను తొలగిస్తుందన్నారు. మూసీ అభివృద్ధి చేయాల్సిందే కానీ, శాస్త్రీయ విధానంలో జరగాలన్నారు. కేవలం పేద, మధ్య తరగతి వర్గాలు నివాసాలను కూల్చివేయొద్దన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్ట్ నిర్వాసితుల్లో ఒకరైన యువతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కర్ణాటక నుంచి వచ్చి ఉంటున్నానని, ఇక్కడే ఇల్లు కొనుక్కొని, కష్టపడి ఈఎంఐ కడుతున్నానని తెలిపారు. తెలుగు కూడా నేర్చుకున్నానని, అందరూ పరిహారం వద్దు అంటున్నారని, తనకు మాత్రం పరిహారం కావాలన్నారు. తనకు పరిహారంగా సీఎం ఇల్లు కావాలని, తన ఇల్లును సీఎం ఇస్తానన్నారు. ''నా ఇల్లు సీఎంకు ఇస్తా.. నాకు సీఎం ఇల్లు కావాలి. అదే నాకు పరిహారం. ఇస్తారా మాకు? ఇస్తే రేపే నా ఇల్లు ఖాళీ చేస్తా. లేదంటే చేయను'' అంటూ యువతి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే మూసీ ప్రాజెక్టును ఆపేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫొటో షూట్ కోసం నిద్ర చేశారని ఎద్దేవా చేశారు. ఆయన బస చేసే ముందు.. ఆ ప్రాంతంలో దోమల, ఈగల మందు పిచికారీ చేయించారని విమర్శించారు.