షాకింగ్‌...అక్షరాలా రూ.1200 కోట్లు పోగొట్టుకున్న సమంత ?

Veldandi Saikiran
సమంత గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన అమాయకమైన నటన, అందంతో ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సామ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా నిలిచింది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన ఆడి పాడింది. గత కొన్ని రోజుల క్రితం నుంచి సమంత తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు.

తనకి మయోసైటిస్ అనే వ్యాధి రావడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం మళ్లీ షూటింగ్ లో పాల్గొంటుంది. కాగా, సమంత ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు "జవాన్". ఈ సినిమాలో మొదట సమంతకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందట.

జవాన్ సినిమాలో నటించడానికి సమంతకు రూ. 20 కోట్ల రూపాయల ఆఫర్ చేశారట డైరెక్టర్ అట్లీ. సమంత అంటే అట్లీకి చాలా సెంటిమెంట్. ఆ కారణంగానే రూ. 20 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పాడట. మొదట సమంత ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తానని ఒప్పుకుందట. కానీ అప్పటికే తనకు మయోసైటీస్ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో చేసేదేమీ లేక ఈ సినిమాలో హీరోయిన్ గా చేయమని నటి నయనతారను సంప్రదించారట.

నయనతార రూ. 12 కోట్ల పారితోషికం తీసుకొని ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. జవాన్ సినిమా రూ. 1200 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో నయనతార పాపులర్ అయింది. సమంత కనక ఈ సినిమాను చేసి ఉంటే తన క్రేజ్ మరింతగా పెరిగేదంటూ సమంత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: