నయనతార.. తెలుగు తమిళ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఆమెకు ఇంతటి స్టార్డం ఈజీగా అయితే రాలేదు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అలాంటి నయనతార జర్నీ పై సంస్థ డాక్యుమెంటరీ చేశారు. అది ఇప్పటికే రిలీజ్ అయింది. ఈ డాక్యుమెంటరీలో తన సినిమాలు, ప్రేమ,పెళ్లి, కుటుంబం ఇలా అనేక విషయాలను పొందుపరిచారు.. అయితే ఈ సందర్భంగా నయనతార అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నయనతార శ్రీరామరాజ్యం అనే చిత్రంలో సీత పాత్ర చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ టైంలో ఆమెపై విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయట. ఆ పాత్ర నయనతార చేయకూడదని దారుణంగా గొడవలు కూడా చేశారట.
కానీ ఆ టైంలో నయనతార ఇలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలియజేశారు.. ఈ పాత్ర చేసే సమయంలో నయనతార షూటింగ్ ఉన్నన్ని రోజులు పూర్తిగా నాన్ వెజ్ మానేసి వెజ్ మాత్రమే తింటూ నిష్టగా ఉందట.. అలా ఎంతమంది విమర్శలు చేసినా నేను ఆ సినిమా షూటింగులో పాల్గొని లాస్ట్ డే చాలా ఎమోషనల్ అయ్యాననింటూ నయనతార చెప్పుకొచ్చింది.. అయితే బయట వారు చేసిన విమర్శలకు నేను ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుదామని అనుకొని చివరికి సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చేశాను.. అంతేకాదు ఓ హీరో నువ్వు సినిమాలకు సెట్ అవ్వవు ఇండస్ట్రీ నుండి వెళ్ళిపో అని అవమానించారు..
కానీ ఆ వ్యక్తులకు నేను భయపడి సినిమాలు పూర్తిగా మానేస్తే వారి ముందు చులకన అవుతానని భావించి , ఎవరైతే మనల్ని అవమానించారో వారు అసూయ పడేలా ఎదగాలని అనుకున్నాను.. ఈ టైంలోనే నాకు దేవుడిలా నాగార్జున కాల్ చేసి మా సినిమాలో ఒక పాత్ర ఉంది. అది నువ్వైతే బాగా చేస్తావని చెప్పారు. దీంతో ఆ సినిమాకు ఓకే చెప్పాను అని తెలియజేసింది. అలా నాగార్జున ద్వారా మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసిన నయనతార ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతేకాదు ఆమె చేసిన శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా దక్కింది.