ఆ విషయంలో జగన్ కి షాక్ ఇచ్చిన అంబటి రాంబాబు? తలలు పట్టుకుంటున్న వైసీపీ నేతలు?
కొన్ని రోజులుగా ఏపీ పోలీసులు ఒక సోషల్ మీడియా వ్యక్తి కోసం వెతుకుతున్నారు. అతను వైసీపీ తరపున సోషల్ మీడియాలో పనిచేస్తూ.. అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. ఏఖంగా హోంమంత్రి అనితపై పోస్టులు పెట్టాడు. అతను పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన వైసీపీ కార్యకర్త రాజశేఖర్‌రెడ్డి అని పోలీసులు కనిపెట్టారు. అతనిపై నూజివీడులో కేసు నమోదు చేసి.. కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. అంతలోనే అతను ఊహించనిది జరిగింది.
రాజశేఖర్ రెడ్డి తాజాగా.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లాడు. ఈ విషయం పోలీసులకు తెలియదు. కానీ అంబటి రాంబాబు.. మంగళవారం దీనిపై స్పందించారు. రాజశేఖర్ తన ఇంట్లోనే ఉన్నాడనీ, కచ్చితమైన ఆధారాలు ఉంటే.. వచ్చి అరెస్టు చేసుకోవచ్చని తెలిపారు. ఇంతలా క్లూ ఇచ్చాక పోలీసులు ఆగుతారా.. బుధవారం గుంటూరులో ఉన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రాజశేఖర్ అక్కడే ఉన్నాడు. రాంబాబుకి ఆధారాలను చూపించిన పోలీసులు.. రాజశేఖర్‌ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు.
అంబటి రాంబాబు తనను కాపాడతారని రాజశేఖర్ అనుకుంటే.. అందుకు రివర్సులో జరిగింది. కూటమి ప్రభుత్వానికి అంబటి రాంబాబు సహకరించినట్లు అయ్యిందనే వార్తలొస్తున్నాయి. వైసీపీ నేతలు, కార్యకర్తలు.. ఇలా ఎందుకు చేశారని తలలు పట్టుకుంటున్నారు. మనమే ఇలా చేస్తే, ఇక పాలక పక్షం అరెస్టుల జోరు పెంచదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అంబటి మాత్రం అరెస్టుపై స్పందించలేదు. తాను సరైన పనే చేశానని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.