కనుకరించిన బాబు... RRR కు కీలక పదవి...?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు రఘురామకృష్ణం రాజుకు కీలక పదవి అప్పగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణం రాజును... ఫైనల్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. కీలక ప్రకటన చేసింది.
 

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం చాలామంది పేర్లు పరిశీలించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కానీ చివరికి టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజుకు ఈ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.  ఈ తరుణంలోనే కూటమిలో ఉన్న జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలతో చర్చలు కూడా చంద్రబాబు నాయుడు జరిపారట. దీంతో రఘురామకృష్ణ రాజును డిప్యూటీ స్పీకర్ గా చేయబోతున్నట్లు ప్రకటించారట.
 దీనికి కూటమి పార్టీలు కూడా ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. దీంతో కూటమి నుంచి మరెవరు కూడా నామినేషన్ వేసే అవకాశాలు లేవు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఎన్నికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా మంత్రి పదవి రఘురామకృష్ణ రాజుకు ఇస్తారని అందరు అనుకున్నారు. కానీ మంత్రి పదవి ఆయనకు దక్కలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కూడా వస్తుందని అందరూ ఊహించారు.
 అక్కడ కూడా రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురయింది. నామినేటెడ్ పోస్టర్లో కచ్చితంగా ఆయనకు పదవి దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురు కావడంతో తాజాగా చంద్రబాబు నాయుడు ఆయనకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణ రాజును ఫైనల్ చేశారు. కాగా ఎన్నికల కంటే ముందే వైసిపి పార్టీకి రాజీనామా చేశారు రఘు రా మకృ ష్ణ రాజు. అనంతరం ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా... ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: