ఏపీ :టిడిపి అండతో పైకి లేస్తున్న జనసేన.. ఎవరికి మేలు..?
ఆనాడు కూటమి బలంగా నిలబడడంతో వైసిపి పార్టీ ఓటమికి కారణమైంది. అలా మెజారిటీతోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే 80 శాతం మంది కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు భర్తీ విషయంలో టిడిపికి 63 జనసేనకు 13 బిజెపికి నాలుగు దక్కినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే మంత్రి పదవులు విషయంలో ప్రతి ఏడు మందికి ఒక పదవి అన్నట్లుగా జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా కార్పొరేటర్ల విషయంలో 13 నామినేషన్ పదవులు రావడం జరిగిందట.. ఇంకా మరో 20 కార్పొరేషన్ల భర్తీ చేయాల్సి ఉన్నదట.
అయితే ఇందులో కూడా మరో మూడు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. కానీ కొంతమంది నేతలు మాత్రం టిడిపికి కూటమిలో భాగంగా సింహభాగం ఉన్నది అందుకే జనసేనకు కనీసం 40 నామినేటెడ్ పదవులు ఇస్తే బాగుంటుందనే విధంగా మాట్లాడుతున్నారట. వీటికి తోడు జమిలి ఎన్నికలు కూడా రెండేళ్లలో వస్తాయని.. ఇప్పుడు జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తేనే అప్పుడు తట్టుకోగలదని.. పార్టీ నేతలు సైతం మాట్లాడుకుంటున్నారట. అంతేకాకుండా ఇప్పుడు ఇచ్చిన పదవులు కూడా జనసేన నేతలలో కేవలం నాలుగోవంతు మాత్రమే ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ గొంతు పెంచాలని చూస్తోందట.. ఒకవేళ కూటమిలో గొంతు పెంచితే.. సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఇలా చేస్తే కచ్చితంగా టిడిపి నేతలు సహించలేకుండా ఉన్నారట. లేదంటే జమిలి ఎన్నికలకు బలాన్ని చూపించాలి అంటే సపరేట్గా ఒక్కొక్క పార్టీ నిలబడితే ఏ పార్టీకి ఎంత బలంగా ఉందనేది తెలిసిపోతుంది.. మరి ఇలా చేస్తే ఎవరు గెలుస్తారనే విషయం సందేహంగానే ఉన్నదట.. వీటికి తోడు టిడిపి అండతో పైకి లేస్తున్న జనసేన పార్టీ ఈ ప్రభావం అటు టిడిపికి అడ్డుగా మారుతోంది.. మరి జనసేన సింగిల్ గా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుందేమో చూడాలి.