ఏపీ: బాబోరు మాట అంటే లెక్క లేదా.. పట్టువదలని ఎమ్మెల్యేలు..!
ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు తోక జాడిస్తే మాత్రం ఊరుకోరని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో మళ్లీ చంద్రబాబుకు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులు కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నారట. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు మాటను అసలు ఏ మాత్రం లెక్క చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన మాట పరిగణంలోకి తీసుకోలేదని.. మద్యం వ్యాపారుల పైన ఎమ్మెల్యేలు వర్తిరి సైతం ఎక్కువగా కొనసాగుతూ ఉండడమే ఎందుకు కారణమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దని మద్యం వ్యాపారుల పైన ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురావద్దనే విధంగా సీఎం చంద్రబాబు నేతలను ఆదేశించారు.
అయినప్పటికీ కూడా చాలామంది నేతలు అటు ఇసుక మద్యం విషయంలో ఏమాత్రం సీఎం చంద్రబాబు మాటని లెక్క చేయలేదట. గత నెల 14 ,15వ తేదీలలో..3,396మద్యం షాపులకు సైతం లైసెన్సులను ఎక్స్చేంజ్ శాఖ జారీచేసింది. అది కాదే నెల 16 నుంచి షాపులు కూడా మొదలయ్యాయి. కొత్త లిక్కర్ షాపులు మొదలయ్యి ఇప్పటికి నెల రోజులు కావస్తువున్న ఇందులో 500 షాపుల వరకు లైసెన్సు రాలేదట. అందుకు కారణం స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు సైతం అక్కడ అడ్డుకట్టు వేయడమే విధంగా వినిపిస్తోంది.. ముఖ్యంగా బాపట్ల, చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, పల్నాడు, తిరుపతి వంటి జిల్లాల పదుల సంఖ్యలో పైగా మద్యం షాపులు రెగ్యులర్ లైసెన్స్ ఇవ్వలేదని సమాచారం. ముఖ్యంగా తమకు వాటా ఇవ్వాలని తమకు వాటా ఇవ్వని వారితో తాము చెప్పినట్లుగా నడుచుకొని వారికి షాపులు దొరకకుండా చేస్తున్నారట.