ప్ర‌పంచంలో పొడ‌వైన న‌డ‌క మార్గం ఇదే... 22 వేల కిలోమీట‌ర్లు... 17 దేశాలు...!

RAMAKRISHNA S.S.
- ప్ర‌పంచంలో నే పొడ‌వైన ర‌హ‌దారి ఇదే
- కేప్‌టౌన్ ( ద‌క్షిణాఫ్రికా ) టు మ‌గ‌డాన్ ( ర‌ష్యా )
- 17 దేశాలు ... 22 వేల కిలోమీట‌ర్లు
- ( గ్లోబ‌ల్ - ఇండియా హెరాల్డ్ ) . . .
మ‌నం ఈ బిజీ లైఫ్ లో ప్ర‌కృతిలో ఎంజాయ్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.. ప్ర‌పంచాన్ని చుట్టి వ‌చ్చే మార్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. జ‌స్ట్ ఫ్లైట్ జ‌ర్నీ చేస్తే ఈ ప్ర‌పంచంలో చాలా దేశాలు నెల రోజుల్లోనే చుట్టేసి వ‌చ్చేయొచ్చు.. అలా కాదు ప్ర‌కృతిని చూస్తూ కూడా న‌డ‌వ వ‌చ్చు. ప్రకృతిని చూస్తూ నడవాలనుకుంటే నడవడానికి ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి,ఇది కేప్ టౌన్ (దక్షిణాఫ్రికా) నుండి మగడాన్ (రష్యా) వరకు వ్యాపించి ఉంది.విమానాలు లేదా పడవలు అవసరం లేదు, అవసరమైనచోట వంతెనలు కూడా ఉన్నాయి. ..

ఇది 22,387 కిలోమీటర్ల రహదారి . . . దీని ద్వారా మొదటినుండి చివరి వర‌కు నడవడానికి 4,492 గంటల సమయం పడుతుంది. ఏకధాటిగా నడిచినచో 187 రోజులు ప‌డుతుంది . లేదా రోజుకు 8 గంటలు చొప్పున నడిస్తే 561 రోజులు పడుతుంది .. దీని మార్గంలో మనం నడిస్తే 17 దేశాలను దాటుతాం. . అంటే ఎంత ప్ర‌కృతి ని మ‌నం ఆస్వాదింవ‌చ్చో తెలుస్తోంది. ఆరు సమయ మండలాలు (TIME ZONES). సంవత్సరంలోని అన్ని  సీజన్లలో ను అంటే అన్ని ఋతువులలోను నడవవలసి ఉంటుంది.  !
 
ఇక ఇదే మార్గం లో సైక్లింగు,మోటారు సైక్లింగు కూడా చేసేయొచ్చు. అయితే అలా చేయాలంటే తగిన అనుమతులు త‌ప్ప‌ని స‌రిగా కావాలి. ఇక ప్ర‌పంచం లోనే అత్యంత పొడ‌వైన రైల్వే మార్గం ట్రాన్స్ సైబీరియ‌న్ రైల్వే మార్గం కావ‌డం విశేషం. ఇది ర‌ష్యా తూర్పు . .. ప‌శ్చిమ స‌రిహ‌ద్దుల‌ను క‌లుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: