నిరుద్యోగులకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఏపీ సర్కార్.. భృతి ఊసే ఎత్తలేదుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు 10 లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏపీ రాజధాని అభివృద్ధికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కార్ సైతం అమరావతి అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. తాజాగా ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిరుద్యోగ భృతికి సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని చాలామంది భావించారు.
 
అయితే ఏపీ సర్కార్ మాత్రం నిరుద్యోగులకు దిమ్మతిరిగే షాకిచ్చే దిశగా అడుగులు వేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి బడ్జెట్ కేటాయించకపోవడంతో ఈ ఏడాది నిరుద్యోగ భృతి లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. బడ్జెట్ లో నిరుద్యోగభృతి ఊసే ఎత్తలేదుగా అంటూ సామాన్యులు కామెంట్లు చేస్తున్నారు.
 
ఏపీ సర్కార్ ఈ కామెంట్లపై ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డ్ వాలంటీర్ల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్లకు వేతనాలు వచ్చే పరిస్థితి సైతం కనిపించడం లేదు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పథకాల అమలు జరిగేలా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.
 
మరోవైపు ఏపీ సర్కార్ కొంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తమది ప్రజా ప్రభుత్వమని మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని నారా లోకేశ్ చెప్పుకొఛ్కారు. బాబు పాలన విషయంలో కొన్ని విమర్శలు వినిపిస్తున్నా మెజారిటీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. బాబు సర్కార్ నిరుద్యోగ భృతి పథకాన్ని వీలైనంత వేగంగా అమలు చేస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపీ బడ్జెట్ పై వైసీపీ రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: