ఏపీ: చక్రం తిప్పిన పవన్.. జగన్ మళ్ళీ జైలుకా.. ఎవరికి ప్రమాదం..?

Divya
2019 ఎన్నికల తర్వాత వైసిపి పార్టీ భారీ ప్రభంజనంతో 2024లో గెలుస్తుంది అనుకున్నప్పటికీ ఘోరమైన ఓటమిని చవిచూసి చూసింది.. దీంతో అప్పటినుంచి అటు వైసిపి నేతలపైన , కార్యకర్తల పైన, సోషల్ మీడియా వారి పైన కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా జూదం విప్పుతోంది.. అయితే ఇలాంటి సమయంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మళ్లీ జైలుకు పంపించే విధంగా బెయిల్ రద్దు చేయించే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుందని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇటీవలె పవన్ కళ్యాణ్ అమిత్షా  భేటీ కారణము కూడా అదే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీకి వెళ్లి అక్కడ కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసిపి హవా పెరిగే ప్రయత్నం ఉందని అందుకు అడ్డుకట్ట వేసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజెపితో మంతనాలు జరుపుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్షా తో సీక్రెట్ ఎజెండా ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.

జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ భూములను టార్గెట్ చేయడమే అందుకు ఒక నిదర్శనమని.. అలాగే సోషల్ మీడియాలో దుష్ప్రచారం పైన కూడా పవన్ కళ్యాణ్ వైసీపీ నే టార్గెట్ చేశారని.. ఈ సమయంలోనే జగన్ బెయిల్ రద్దు చేయడానికి కూడా బిజెపితో మంతనాలు జరుపుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ ఆయనను జైలుకు పంపిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆవా తగ్గుతుందనే విధంగా కూటమి ప్రభుత్వం భావిస్తోందట. ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు కూడా ఇతర పార్టీలలోకి వెళ్తున్నారని ప్లాన్లతో అమిత్ షాను కలిసినట్లు సమాచారం.

అయితే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తే ఖచ్చితంగా ఈసారి ఎన్నికలలో మళ్లీ వైసీపీ పార్టీ ప్రభంజనం మొదలవుతుందని పలువురు కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు.. గతంలో కూడా అదే సింపతితో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి ముఖ్య కారణం అయ్యిందని.. ఇప్పటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి పథకాలను అమలు చేయకపోవడమే కాకుండా మహిళల పైన అత్యాచారాలు, సామాన్యులకు కూడా అందనంత దూరంలో నిత్యవసర సరుకులు ఉండడంతో ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు.. అంతేకాకుండా కూటమి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు కూటమిపైన వ్యతిరేకత మొదలయ్యిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎవరికి ప్రమాదమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: