కేసీఆర్ కుటుంబంపై ఆటం బాంబులు ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో దీపావళి టపాకాయల రాజకీయాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలాగే మంత్రులను ప్రశ్నిస్తే... బాంబులు పేల్చుతామని... ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న గులాబీ పార్టీని ఉద్దేశించి... తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా బాంబులు పేలే అవకాశాలు ఉన్నాయని... పది రోజుల కిందట దక్షిణ కొరియా పర్యటనలో పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
 ఆ ఎపిసోడ్ అనంతరం... కల్వకుంట్ల తారక రామారావు బామ్మర్ది ఇంట్లో పోలీసులు హడావిడి చేశారు. డ్రగ్స్ కేసు బుక్ చేసే ప్రయత్నాలు కూడా చేసింది రేవంత్ రెడ్డి. అయితే మందు పార్టీని డ్రగ్స్ పార్టీగా మార్చేశారని...  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డంగా బుక్ చేసింది గులాబీ పార్టీ. దీంతో ఆ కేసు నుంచి కేటీఆర్ బయటపడ్డారు. అయితే మళ్లీ..  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూ గులాబీ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ అలాగే హరీష్ రావులు దూసుకు వెళ్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో... కేటీఆర్ అలాగే హరీష్ రావుల దూకుడును తగ్గించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యూహరచనలు చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మరో ప్రకటన చేయించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. త్వరలోనే తెలంగాణలో ఆటంబాంబు పేలబోతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాంబు పేల్చారు. మొన్న దీపావళికి లక్ష్మీ బాంబు పేలలేదు... తుస్సు మంది అని కేటీఆర్... వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు.
 తనను నెల రోజుల తర్వాత జైల్లో వేస్తారని కేటీఆర్... వ్యాఖ్యానించారని... తానేమి తప్పు చేయలేదని ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కానీ త్వరలోనే నాటుబాంబు, లక్ష్మీ బాంబు కాకుండా ఆటంబాంబు పేలబోతుందని బాంబు పేల్చారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తప్పు చేసిన వారి గుండెల్లో ఆటంబాంబు పేల్చుతామని కూడా వార్నింగ్ ఇచ్చారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో... కేటీఆర్ త్వరలోనే అరెస్టు కాబోతున్నారని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు.. కొంతమంది చెబుతున్నారు. కానీ ఆ కేసు నిలబడదని కూడా.. కొంతమంది వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: