పడ్డ చోటే నిలబడాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మునిగిన పడవలో ఎక్కి మరి... ఒడ్డుకు చేరుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వైసీపీ పార్టీ గురించి ఓ సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికల్లో వైసీపీ పార్టీని ముంచేసింది అని అంటూనే... మళ్లీ ఐ ప్యాక్ టీం ను ఫామ్ లోకి తీసుకు వస్తున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
175 స్థానాలకు 175 గెలిచి మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వైసీపీ నేతలు విర్రవీగారు. అటు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా 175 స్థానాలు గెలుస్తామని ఎన్నికల కంటే ముందు... రకరకాల ప్రసంగాలతో జనాల్లో ఊపు తీసుకొచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 175 స్థానాలు కాదు కదా... వంద కూడా కొట్టలేకపోయారు. కేవలం 11 స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితమైన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే ఏపీలో వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కారణం.... ఐ ప్యాక్ , వాలంటీర్ వ్యవస్థ అని ఇప్పటికీ చాలామంది అంటుంటారు. వైసీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసిపి కార్యకర్తలు అలాగే లీడర్లకు ఎలాంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదని... కేవలం వాలంటీర్ వ్యవస్థ అలాగే ఐ ప్యాక్ ను మాత్రమే పట్టించుకున్నాడని విమర్శలు ఇప్పటికి వస్తున్నాయి.
అయితే అలాంటి ఐ ప్యాక్ టీం ను మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ టీం వాస్తవంగా ఈ రాజకీయ నాయకులతో పనిచేయదు. కేవలం వైసీపీ పార్టీకి అనుకూలమైన అంశాలను... నెగిటివ్ గా ఉన్న విషయాలను... ఒక టీం గా ఏర్పడి జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇస్తుంది. అందుకే మరోసారి.. ఆ టీంకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. అందుకే మళ్ళీ ఐపాక్ ను నిర్మించాలని అనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.