ఏపీ: నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఆ పోస్టులు వాయిదా..!
నవంబర్ 4వ తేదీన ఆన్లైన్ టెట్ ఫలితాలను సైతం రిలీజ్ చేశారు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే అంటే ఆరో తేదీన మెగా డీఎస్సీ రిలీజ్ చేయబోతున్నట్లు విద్యాశాఖ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ బుధవారం రాలేదని ఎప్పుడు వెలుబడుతుందనే విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్ల పైన కూడా ఇంకా MRPS ముందు నుంచి అభ్యంతరాలను తెలియజేస్తోంది ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఉద్యోగి నియామకాలు ఎవరూ చేపట్టకూడదని డిమాండ్ చేస్తుందట.
మంగళవారం రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో కూడా మందకృష్ణ భేటీ అయ్యారు. రిజర్వేషన్లు అమలు పైన కూడా పలు అంశాలను ఏపీ సీఎంతో చర్చించారని అలాగే డీఎస్సీ నియామకాల లో కూడా ఎస్సీ రిజర్వేషన్లు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలంటు సీఎం చంద్రబాబుని కోరారట. అందుకే మెగా డీఎస్సీ ఆలస్యం అవుతున్నట్లు పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. వయోపరిమితుల సడలింపుతో పాటుగా రిజర్వేషన్ల పైన క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజయో తెలియదు కానీ నిరుద్యోగులకు మాత్రం నిరాశనే మిగులుస్తోంది.