అమెరికా విజేత: 177 స్థానాలతో దూసుకెళుతున్న ట్రంప్ ..మ్యాజిక్ ఫిగర్ ఎంతంటే ?
వెర్మాంట్, రోడ్ ఐల్యాండ్, మేరీ ల్యాండ్, మసాచు సెట్స్, కనెక్టికట్ లో కమలహారిస్ విజయం సాధించారు. ఇప్పటివరకు డోనాల్డ్ ట్రంప్ 177కు పైగా ఎలక్టోరల్ ఓట్లను సాధించగా.... కమలహారిస్ వెనుకబడింది. ఆమెకు కేవలం 99 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే అమెరికా అధ్యక్ష రేసులో 200 స్పీడుతో దూసుకెళుతున్నాడు డోనాల్డ్ ట్రంప్. ఇదే స్పీడ్ కొనసాగితే.. అమెరికా కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ నియామకం అవుతారన్న మాట. అయితే... అమెరికా అధ్యక్షుడిని పరోక్ష ఎన్నిక అంటే ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోరు.
అమెరికా ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కమలహారిస్ లేదా ఇతర అభ్యర్థులకే ఓటు వేసినప్పటికీ అధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం లేదు. అధ్యక్షుడిని నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులను మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ సీట్లు ఉంటాయి. ఈ 538 మందిలో 270 వచ్చిన వారు అధ్యక్షులు అవుతారు. అమెరికా అధ్యక్షుడు ఎన్నికలను ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది.
డెమోక్రాట్ కమలహరిస్, రిపబ్లికన్ అండ్ డోనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఈ ఎన్నికల్లో అమెరికా పౌరులకు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి మొదలైనవి అతి ముఖ్యమైన అంశాలుగా నిలిచాయి. ఈ మేరకు ప్రాథమిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే.. ఇటీవలే విడుదల అయిన ఎగ్జిట్ ఫలితాల ప్రకారం.. రిపబ్లికన్ అండ్ డోనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని తేల్చాయి.