హీరోయిన్ కాకముందే రోజా కూతురుకు వేధింపులు?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసిపి కీలక నేత రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన రోజా.... ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు. నగరి నియోజకవర్గ నుంచి దాదాపు రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజా.... ఒకసారి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు.

అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా దారుణంగా ఓడిపోయారు. నగరి నియోజకవర్గంలో... టిడిపి అభ్యర్థి చేతిలో రోజా ఓడిపోవడం జరిగింది. అక్కడ ఉన్న వర్గ పోరు  కారణంగా వైసిపి ఓడిపోయిందని చెప్పవచ్చు. అయితే వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత.... కూటమి సర్కార్ దౌర్జన్యంగా వ్యవహరిస్తామని వార్తలు వస్తున్నాయి.

ఇదే విషయంపై వైసీపీ నేతలు కూడా తరచూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి రోజా కూతురిని కొంతమంది సోషల్ మీడియాలో వేధిస్తున్నారని స్వయంగా రోజా ఆరోపణలు చేయడం జరిగింది. కొంతమంది టీడీపీ కూటమికి సంబంధించిన... వ్యక్తులు తన కూతురిని వేధిస్తున్నారని మండిపడింది. తిరుపతి జిల్లా ఎలమందకు చెందిన బాలిక ఘటనపై... తప్పుడు ప్రచారం చేశారన్న ... జనసేన నేతలపై రోజా తాజాగా నిప్పులు చెరిగారు.  ఈ విషయంలో తనను సోషల్ మీడియాలో... రోలింగ్ చేస్తున్నారని రోజా ఆగ్రహించారు.


క్కడితో ఆగకుండా తన కూతురిని కూడా సోషల్ మీడియాలో వేధిస్తున్నారని మండిపడింది రోజా. పనిచేయడం చేతకాక తన కుటుంబం పైన పడుతున్నారని... కూటమి నేతలపై ఆగ్రహించారు రోజా. అసలు ఏపీలో హోం మంత్రి అనిత.. డమ్మీ మంత్రి అంటూ రెచ్చిపోయారు రోజా. ఇలాంటి హోం మంత్రి ఉంటే.. ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతూనే ఉంటాయని రెచ్చిపోయారు రోజా. ఇక డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అధికారంలో ఉండి దండగే అంటూ చురకలు అంటించారు. ఎన్నికల కంటే ముందు మాయ మాటలు చెప్పాడని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పై ఫైర్‌ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: