జనసేనలో కోవర్టులు.. పిఠాపురం వర్మ సంచలనం ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన వర్శిస్ తెలుగుదేశం పార్టీల మధ్య చాలా చోట్ల అవివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో... కూటమి నేతల కుమ్ములాటలు ప్రతిరోజు తెరపైకి వస్తున్నాయి. వారంలో రెండు రోజులైనా... టిడిపి వర్సెస్ జనసేన మధ్య ఏదో ఒక గొడవ జరుగుతుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ను టార్గెట్ చేసి జనసేన నేతలు.. విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో తాజాగా... పిఠాపురం నియోజకవర్గంలో మరో గొడవ చోటుచేసుకుంది.  ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి పేర బత్తుల  రాజశేఖర్ ను వ్యతిరేకిస్తూ జనసేన నేతలు  నిప్పులు చెరిగారు. వాస్తవంగా ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా..  రాజశేఖర్ బరిలో ఉన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి నేత రాజశేఖర్ కు అవకాశం దక్కింది. అయితే దీన్ని జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు.
రాజశేఖర్ కూటమి అభ్యర్థిగా వ్యవహరించడం లేదని... టిడిపి అభ్యర్థిగా వ్యవహరిస్తున్నాడని... తాజాగా ఓ మీటింగ్లో గొడవకు దిగారు జనసేన నాయకులు. ఈ తరుణంలోనే.... జనసేన పార్టీ నేతలు, వర్సెస్ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవ నేపథ్యంలో... పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీని ఉద్దేశించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
జనసేన పార్టీలో కోవర్టులు ఉన్నారని బాంబు పేల్చారు వర్మ. వైసిపి నుంచి వచ్చి... చాలామంది జనసేనలో చేరుతున్నారని మండిపడ్డారు. అలాంటి నేతలే ఇప్పుడు.. కోవర్టులుగా మారి... తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు వర్మ. అయితే వైసిపి నుంచి వచ్చే నేతలను... జనసేనలో చేర్చుకునే ముందు కాస్త ఆలోచించాలని....  లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని వర్మ ఆగ్రహించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: