చంద్రబాబుకు డేంజర్‌ బెల్స్‌ పంపిస్తున్న యనమల ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 160 స్థానాలకు పైగా గెలిచి...తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికల కంటే ముందు సూపర్ సిక్స్ అంటూ రకరకాల హామీలు ఇచ్చింది తెలుగుదేశం కూటమి. దీంతో చాలామంది ఓటర్లు, వైసీపీ పార్టీకి ఓటు వేసే వారు కూడా... తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లారు.

ఈ తరుణంలోనే వైసీపీ పార్టీకి 11 స్థానాలు వచ్చాయి. అటు కూటమి ప్రభుత్వానికి 160 స్థానాలకు పైగా రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత.... పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం  చాలా వెనుక పడుతోందని వార్తలు వస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబుకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని నివేదికలు కూడా చెబుతున్నాయి. విజయవాడలో వరదలు రావడం... అలాగే తుఫాన్లు వరుసగా చోటు చేసుకోవడం... కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది.

అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల కంటే.. ముందు ఇచ్చిన హామీలను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే.. వైసీపీ మళ్లీ పుంజుకుంటుంది. ఇలాంటి తరుణంలోనే... తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడుకు టీడీపీ నేత యనమల డేంజర్‌ బెల్స్‌ పంపించారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబుకు సూచనలు చేశారు.

మేనిఫెస్టో అంశాలను బడ్జెట్లో ప్రవేశపెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్టే భవిష్యత్తుకు ప్రామాణికంగా ఉంటుందని  సీఎం చంద్రబాబు నాయుడుకు గుర్తు చేశారు టీడీపీ నేత యనమల. 15 శాతం మేర ఆర్థిక వృద్ధి ఉండాలనే సీఎం చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ కష్టం కాదని వివరించారు యనమల. కానీ.. చాలా కష్టంతో కూడుకున్నదే టీడీపీ నేత యనమల చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అధిగమించి ఆర్థిక వృద్ధి సాధించాల్సి ఉంటుందని హెచ్చరించారు టీడీపీ నేత యనమల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: