జగన్ కు సాధ్యం కానిది లోకేశ్ కు సాధ్యమా.. ఈ ప్రశ్నలకు జవాబులేవి?

Reddy P Rajasekhar
ఏపీకి ప్రస్తుతం అమరావతి రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు జగన్ సర్కార్ చేసిన చిన్నచిన్న తప్పుల వల్ల అమరావతి కీర్తిప్రతిష్టలు మసకబారాయి. అయితే కూటమి మాత్రం అమరావతి అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ తెలివిగా అడుగులు వేస్తోంది. అయితే జగన్ పాలనలో ఏపీకి సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చినా మరీ ఎక్కువ సంఖ్యలో కంపెనీలు అయితే రాలేదనే సంగతి తెలిసిందే.
 
జగన్ కు సాధ్యం కానిది లోకేశ్ కు సాధ్యం అవుతుందేమో చూడాల్సి ఉంది. లోకేశ్ ప్రస్తుతం ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. అయితే ఈ ప్రయత్నాలు ఎంతమేర సఫలమవుతాయో చూడాలి. కొంతకాలం క్రితం విజయవాడకు వరదలు రావడం అమరావతి కీర్తిప్రతిష్టలపై కొంతమేర ప్రభావం చూపింది. లోకేశ్ వేగంగా రాష్ట్రానికి కంపెనీలను తెప్పిస్తే మాత్రమే ఈ పరిస్థితి మారుతుంది.
 
జగన్ కు సాధ్యం కానిది లోకేశ్ కు సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలకు ధీటుగా అమరావతి అభివృద్ధి జరగాలనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి జరిగితే మాత్రమే 2029 ఎన్నికల్లో కూటమి సులువుగా గెలిచే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నారా లోకేశ్ మంత్రిగా మంచి పేరునే సంపాదించుకున్నారనే చెప్పాలి.
 
నారా లోకేశ్ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. నారా లోకేశ్ భవిష్యత్తులో మరింత మంచి పేరును సొంతం చేసుకుని కెరీర్ పరంగా మరింత ఎదగాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. నారా లోకేశ్ పొలిటికల్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. వైసీపీకి మాత్రం వరుసగా భారీ షాకులిచ్చే దిశగా నారా లోకేశ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నారా లోకేశ్ కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉంటూ ప్రజల మెప్పు పొందే విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: