1 అవర్ ఏ వీక్ ప్రాజెక్ట్ తో యువతకు అద్భుత భవిష్యత్తు.. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలివే!

Reddy P Rajasekhar
ఐఎస్ఎఫ్ ఫౌండర్, ఛైర్మన్ జేఏ చౌదరి దేశంలోని యువతకు, నవ్యత ఉన్న ఆలోచనలకు సరైన వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎన్నో స్టార్టప్ ల ప్రణాళికలను కార్యరూపంలోకి తీసుకొని రావడంతో పాటు ఐఎస్ఎఫ్ ద్వారా యువ పారిశ్రామికవేత్తలను అందిస్తున్నారు. జేఏ చౌదరి 1 అవర్ ఏ వీక్ ప్రాజెక్ట్ కు సంబంధించి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
యువతకు సాంకేతిక నైపుణ్యాలను, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన వైవిధ్యంతో కూడిన ప్రాజెక్ట్ 1 అవర్ ఏ వీక్. వారంలో కేవలం 60 నిమిషాల సమయాన్ని కేటాయించడం ద్వారా యువత సాంకేతిక పాఠాలను నేర్చుకోవడంతో పాటు ఆ పాఠాలను వారి ప్రాజెక్టుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. విద్యార్థులకు, స్టార్టప్ లకు, యువ పారిశ్రామికవేత్తలకు 1 అవర్ ఏ వీక్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని జేఏ చౌదరి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది.
 
ఈ ప్రాజెక్ట్ సహాయంతో కొత్త ఆలోచనలను ఆవిష్కరించడంతో పాటు డిజిటల్ టూల్స్ ను నేర్చుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ సమయంలోనే యువతకు ముఖ్యమైన టెక్నాలజీ, పరిజ్ఞానాన్ని తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగం చేయాలని భావించే వాళ్లు ఉద్యోగ అవకాశాలు సైతం మెరుగుపరచుకోవచ్చని జేఏ చౌదరి పేర్కొన్నారు.
 
ఈ సంస్థలో వేర్వేరు రంగాల్లో నిపుణులైన, ఎంతో అనుభవం ఉన్న మెంటార్లు ఉండటంతో పాటు వాళ్లు స్టార్టప్ లకు ఎదురయ్యే ప్రధాన సవాళ్లను పరిష్కరించడంలో కృషి చేస్తారని జేఏ చౌదరి వెల్లడించారు. టెక్నాలజీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులతో పాటు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు, గుర్తింపును కలిగి ఉన్న వ్యాపారవేత్తలు, పరిశ్రమ నిపుణులు మెంటర్లుగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. వీరి మార్గదర్శకత్వం స్టార్టప్ ల ఎదుగుదలతో పాటు స్టార్టప్ లను అంతర్జాతీయ స్థాయిలో పోటీకి నిలబడేలా దోహదపడుతుందని జేఏ చౌదరి వెల్లడించగా ఆయన చెప్పిన విషయాలు యువతలో స్పూర్తి నింపేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: