వైసీపీలో ముగిసిన వాసిరెడ్డి శకం... జగన్‌కు రాం రాం...!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైసిపిలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో సీనియర్ మహిళ నేత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు . ఆమె ఎవరో కాదు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. వైసిపిని వీడారు. ఈరోజు ఆమె అధికారికంగా పార్టీకి రాజీనామా చేస్తారంటూ పార్టీ వర్గాల ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు అదే నిజం అయ్యింది. పద్మకు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. చివరకు ఎమ్మెల్సీ అయినా ఇస్తారని ఆమె ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి కూడా రాజీనామా చేశారు.
అప్పటినుంచి వైసీపీలో ఉన్న యాక్టివ్గా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పద్మ పెద్దగా వాయిస్ వినిపించడం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పద్మ వాయిస్ గట్టిగా వినిపించేది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న సమయంలోను అంతకు ముందు వైసీపీ తరఫున తన గొంతును వినిపించిన వాసిరెడ్డి పద్మ.. కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. మహిళా కమిషన్ చైర్పర్సన్‌తో సరిపెట్టారని.. తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొద్ది రోజులుగా వాసిరెడ్డి పద్మ అసంతృప్తితో ఉన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరిగా సీనియర్ నాయకులు అందరూ వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేస్తారని చర్చ జరుగుతూ వచ్చింది. చివరకు అదే నిజం అయ్యింది. మరి వాసిరెడ్డి పద్మ రాజకీయాలకు దూరంగా ఉంటారా.. లేదా వేరే ఏదైనా పార్టీలో చేరతారా.. అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు పద్మా తనకు లేద.. తన భర్తకు టికెట్ కేటాయించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ కోరారు. అయినా జగన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అప్పడినుంచి ఆమె పార్టీలో అంత యాక్టివ్గా అయితే ఉండటం లేదు.