ఏపీ: దీపావళి రోజున మహిళలకు రెండు గ్యారెంటీ అమలు..!

Divya
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఏపీ ప్రజలు మహిళలు సైతం పథకాల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు తన రాజకీయ జీవితంలోని కనివిని ఎరుగని రీతిలో హామీలను ఇవ్వడమే కాకుండా వాటిని నెరవేర్చడానికి నాన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం వైసీపీ తీసుకు వచ్చిన పథకాలకు పేర్లు మార్చి ఇవ్వడానికి సిద్ధమైన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క హామీను కూడా నెరవేర్చలేదు.. కేవలం పింఛన్ పెంపు పథకాన్ని మాత్రమే అమలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం పైన అటువైసీపీ నేతలు ప్రజలు కూడా విమర్శిస్తూ ఉన్నారు.

అయితే ఇప్పుడు తాజాగా మహిళలకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు పథకం పైన , అలాగే ఉచిత సిలిండర్ అమలు చేయడం పైన కూడా పలు వ్యాఖ్యలు చేశారు. దీపావళి పండుగ మరుసటి రోజు ఈ రెండు పథకాలను ఒకేసారి అమలు చేస్తామని.. దీపావళి రోజున ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే మరుసటి రోజున ఫ్రీ బస్ స్కీములు కూడా విడుదల చేస్తామని తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ నుంచి దీపావళికి మహిళలకు డబుల్ ధమాకా అంటూ ట్వీట్ చేశారు.

మహిళల కోసమే సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారని పేదల కోసం రేషన్ కార్డులు, ఎన్టీఆర్ గృహాలు మరిన్ని పెన్షన్ ఇచ్చేందుకే సాయి శక్తుల ప్రయత్నిస్తున్నారంటూ తెలియజేశారు. గత కొన్ని నెలలుగా అటు ఫ్రీ బస్ ఉంటుంది అనే విషయంపై కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదు మరి ఈ దీపావళికైన ఈ పథకాలను అమలు చేస్తారో లేదో చూడాలి మరి. అయితే గతంలో దసరా పండుగకి ఫ్రీ బస్సు ని అమలు చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి కానీ అది జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: