ఏపీ: పవన్ పై సెటైరికల్ ట్విట్ చేసిన వైసిపి మహిళ నేత..!

Divya
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన తాజాగా వైసీపీ మహిళా నేత ఆర్కే రోజా ఫైర్ కావడం జరిగింది.. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో మైనర్ బాలికపైన దారుణమైన ఘటన జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోకుండా  సైలెంట్ గా ఉన్నారంటూ పలు రకాల ప్రశ్నల వర్షం కురిపించారు.అలాగే మహిళల భద్రత పట్ల కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది అంటూ ప్రశ్నిస్తోంది. అలాగే మీరు పంచే ఎగ్గట్టాల్సింది గుడి మెట్ల పైన కాదు.. విజయవాడ వరద బాధితుల సహాయము కోసం అంటూ తెలియజేసింది.

అలాగే మీరు ధర్మం ధర్మం అని అరిచేది రోడ్డు  మీద కాదు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల పొట్ట కొట్టకుండా ఉండడం  కోసం అంటూ రోజా వెల్లడించింది. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పైన ఘాటుగానే స్పందిస్తూ పలు రకాల ప్రశ్నలను వేయడం జరిగింది. అలాగే కొన్ని పనులు చేస్తే బాగుంటుంది అని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది వైసిపి మహిళ మంత్రి రోజా.. మీరు గొడవ పడాల్సింది మతాల కోసమో కాదు నీట మునిగిపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్న పేదవారి కోసము.. మీరు కడగాల్సింది మెట్లు కాదు ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకులను అవినీతిని అరికట్టాలి అంటూ తెలిపింది. మీరు దీక్ష చేయవలసినది ప్రసాదాల కోసమో కాదు రాష్ట్రంలో చిన్న పిల్లల మానాల కోసం అంటూ తెలిపింది. అలాగే మీరు ఉపవాసాలు చేయాల్సింది దేవుళ్ల కోసం కాదు కలుషితమైన ఆహారం వల్ల విద్యార్థులు అనారోగ్య సమస్యల పాలవుతున్నారంటూ తెలియజేసింది.

అలాగే మీరు బొట్టు పెట్టాల్సింది గుడిమెట్లకు కాదు.. నాడు నేడు వంటి పథకాలతో స్కూళ్లను బాగు చేయాలి అంటూ తెలియజేసింది.. మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన జనాన్ని మోసం చేయకుండా చూడండి భద్రతల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని మీరు దృష్టి పెట్టాల్సింది.. పక్క రాష్ట్ర నాయకులు పైన కాదు మీ నియోజకవర్గంలో జరిగే కొన్ని వికృతి చేష్ట లపై అంటే ఫైర్ అయ్యింది రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: