కాంగ్రెస్ పై పెరుగుతున్న నమ్మకం..! ఆ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు?
దేశంలో కాంగ్రెస్ పెరుగుతోంది. ఎవరు ఏ సర్వేలు చేయకుండానే ఏ రకమైన జోస్యం చెప్పకుండానే ఈ సారి దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. ఇండియా కూటమి కట్టి కాంగ్రెస్ భారీ రాజకీయ లబ్ధిని పొందుతోంది. అది ఎప్పటికప్పుడు మరింతగా బలపడుతోంది.
కాంగ్రెస్ ఉత్తరాదిన పోగోట్టుకున్న చోటనే జెండా పాతుతోంది. దాంతో ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పాత్ర అమాంతం పెరిగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో పవర్ లోకి వచ్చింది. కేరళలో లోక్ సభ ఎన్నికల్లో బెటర్ పొజిషన్లోకి వచ్చి మెజార్టీ ఎంపీ సీట్లను గెలుచుకుంది. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ తో కలిసి బాగానే సీట్లు సంపాదించుకుంది.
ఇక మొత్తం దక్షిణాదిన చూస్తే ఏపీ మీదనే కాంగ్రెస్ కన్ను ఉంది. దేశంలో రాజకీయం మారితే దాని ప్రభావం కచ్ఛితంగా ఏపీ మీద కూడా ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏపీ ఒకనాడు కాంగ్రెస్ కు కంచుకోట. ఇప్పుడు దేశ వ్యాప్తంగా జనాల అభిప్రాయడాలు మారినప్పుడు ఏపీ కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుంది అన్నది కూడా ఉంది. మరోవైపు చూస్తే 2029 నాటికి కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో కూడా ఎంతో కొంత పుంజుకుంటుంది అన్నది కూడా ఉంది.
ఇక కాంగ్రెస్ ఎదుగుతోంది అంటే ఏపీలోకూడా కొత్త మిత్రులు దొరుకుతారు అన్న ఆశలు ఉన్నాయని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తే ఏపీలోని సీనియర్లకు కూడా పొలిటికల్ గా అకామిడేషన్ దొరుకుతుంది అన్న చర్చ కూడా ఉంది. ఈ క్రమంలో ఏపీ లో మళ్లీ సీనియర్లు చురుకుగా స్పందిస్తున్నారు. ఈ పరిణామాణల నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పీఠం మీద చాలా మంది సీనియర్ల కన్ను పడింది. గతంలో పీసీసీ చీఫ్ పదవి మాకొద్దు అన్న వారు సైతం ఇప్పుడు కావాలని పట్టుబడుతున్నారు. దానికి జాతీయ స్థాయిలో మారిన రాజకీయమే కారణం అని అంటున్నారు. మరి రాహుల్ గాంధీ ఏపీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.