ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం .. టాలీవుడ్‌కు భారీ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్..!
ఇక తిరిగి వెళ్లే సమయంలో కూడా హీరో రోడ్డు షో చేసుకుంటూ వెళ్లారని సీఎం అన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాం .. ఏ 11 గా ఉన్న హీరోని కూడా అరెస్టు చేసాం .. అయితే అరెస్టు చేసే సమయం లో పోలీసుల తో దురుసుగా ఆయన ప్రవర్తించారు .. చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలనేది మా గవర్నమెంట్ విధానం .. టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి కూడా ఇచ్చాం .. కానీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమని రేవంత్ అన్నారు. ఆస్పత్రిలో ఉన్న బాలుడిని పరామర్శించేందుకు ఎవరూ వెళ్లలేదు .. కానీ హీరో అరెస్టు అయితే ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చింది .. అరెస్టుపై ప్రతిపక్షాలు నానా యాగి చేశాయి అంటూ రేవంత్ ఫైరయ్యారు ..
అదేవిధంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో ప్రీమియర్ షోలు వేశారు .. కాగా ప్రీమియర్ సమయంలో హీరో అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు .. ఇక ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ప్రస్తుతం ఆ బాలుడుకి హాస్పటల్ లో చికిత్స జరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమపై కఠిన చర్యలు ఉంటాయని .. టికెట్ రేట్లు పెంచడం , బెనిఫిట్, ప్రీమియర్ షోలు వంటివి తెలంగాణలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఉండవని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ ప్రకటించారు.