కొండా సురేఖకు హైకమాండ్ దిమ్మతిరిగే షాక్.. మంత్రి పదవిని కోల్పోయినట్టే?

Reddy P Rajasekhar
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు భారీ షాక్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది. కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని హైకమాండ్ ఆదేశించినట్టు సమాచారం అందుతోంది. ఆమె విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకం కావడంతో పాటు ఆమె చేసిన ఆరోపణలకు ఆధారాలు లేకపోవడం, ఆమె చేసిన తప్పులు పార్టీపై ప్రభావం చూపుతుండటంతో హైకమాండ్ ఈ దిశగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది.
 
కొండా సురేఖ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగించాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ అమలతో పాటు పలువురు సెలబ్రిటీలు పోస్టులు  చేయడం ఈ వివాదం హైకమాండ్ దృష్టికి వచ్చింది. సురేఖ మంత్రి పదవిని కోల్పోయినట్టేనని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని సమాచారం అందుతోంది.
 
మొదట కొండా సురేఖకు పదవికి రాజీనామా చేసే అవకాశం ఇవ్వనున్నారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తే మాత్రం తెలంగాణ సీఎం ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని భోగత్. ఆమెకు బదులుగా మరో బీసీ మహిళకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. వివాదం పరిష్కరించుకునే దిశగా ఆమె అడుగులు వేయకపోవడంతో పాటు నాగార్జున సైతం ఈ వివాదం విషయంలో సీరియస్ గా ఉండటంతో ఆమెకు షాక్ తగలడం పక్కా అని తెలుస్తోంది.
 
మా కుటుంబాన్ని బలిపశువులను చేస్తే ఊరుకోమంటూ అఖిల్ సైతం కొండా సురేఖకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోవడం కూడా ఆమెకు మైనస్ అయిందని తెలుస్తోంది. నాగార్జున నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరో ఒకటి రెండు రోజుల్లో కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తప్పుకున్నట్టు ప్రకటన వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: