జగన్ కు పవన్ సాయం....చంద్రబాబు సీరియస్ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత... వైసిపి పార్టీ అష్ట కష్టాలు పడుతోంది. ఆ పార్టీ నడపడమే కష్టంగా మారింది. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే రావడం... నాలుగు పార్లమెంట్లే గెలుచుకోవడంతో... డీలా పడిపోయింది జగన్ టీం. చాలామంది ఫైర్ బ్రాండ్ నేతలందరూ ఓడిపోయారు. గెలిచిన వారిలో పెద్దగా మాట్లాడే వారే లేరు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సతమతమవుతున్నారు.
 

అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా వైసీపీలో ఉన్న నేతలు.... షాక్ ఇస్తూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని, కిలారి రోశయ్య   తదితర నేతలు అందరూ... వైసీపీకి రాజీనామా చేసి....జనసేన వైపు వెళ్ళిపోయారు. అటు రాజ్యసభ సభ్యులు  ఆర్ కృష్ణయ్య, మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ తదితరులు కూడా వైసీపీకి రాజీనామా చేసి.. జనసేన వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంకా చాలామంది వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన వైపే చూస్తున్నారట.  షర్మిల ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్, లేదా బిజెపి, అటు తెలుగుదేశం పార్టీలో చేరకుండా.... కేవలం జనసేన వైపే వెళ్తున్నారు నేతలు. వాస్తవంగా ఇప్పుడిప్పుడే జనసేన పార్టీ బలంగా తయారవుతోంది. అందులో బలమైన లీడర్షిప్ లేదు. భవిష్యత్తు కూడా జనసేన పార్టీదే అని తెలుస్తోంది.  చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ ఇస్తే టిడిపి పార్టీ పరిస్థితి కూడా దారుణంగా తయారవుతుంది.
అంటే భవిష్యత్తులో వైసిపి వర్సెస్ జనసేన  ఫైట్ కొనసాగే ఛాన్స్ ఉందని ఈ నేతలు అనుకుంటున్నారట. అందుకే జనసేనలోకి వెళ్తే భవిష్యత్తు... బాగుంటుందని ఈ నేతలందరూ అందులోకి వెళ్తున్నట్లు సమాచారం.  అలాగే గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీతో ఈ నేతలందరూ ఫైట్ చేస్తున్నారు కాబట్టి అటు కాకుండా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నారు.  అయితే దీనిపై చంద్రబాబు కాస్త గుర్రుగా ఉన్నారట. టిడిపిలో చేరకుండా జనసేనలోకి వెళ్లడం... పట్ల అసంతృప్తిగా ఉన్నారట బాబు. ఈ అంశాన్ని మోడీ వద్దకు కూడా తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట. జనసేన బలపడితే మొదటగా ప్రమాదం వచ్చేది తెలుగుదేశం పార్టీకేనని.. భావించి చంద్రబాబు ఇలా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: