పుట్టపర్తిలో పట్టు నిలుపుకుంటున్న సింధూర రెడ్డి.. మామ హైప్ మరింత ప్లస్ అయిందిగా..!!
* వారసత్వ రాజకీయాలకు వేదికగా ఆంధ్రప్రదేశ్
* మామ క్రేజ్ తో ప్రత్యక్ష రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి పల్లె సింధూర రెడ్డి
* అద్భుతమైన వాగ్ధాటితో డైనమిక్ లీడర్ గా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అంతా యంగ్ లీడర్లదే.. ప్రస్తుతం వున్న రాజకీయ నాయకులంతా తమ రాజకీయ వారసులను ప్రకటిస్తున్నారు..దీనితో అధికార ప్రతి పక్ష పార్టీలలో యంగ్ లీడర్ల హవా కొనసాగుతుంది.. గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ పార్టీ 2024 ఎన్నికలలో తన పంథా మార్చుకుంది.. ప్రజలలో వ్యతిరేకత వున్న సీనియర్ నాయకులకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ ముందు నుంచి చెబుతూ వచ్చారు.. అయితే అటువంటి సీనియర్ నాయకులు తమకు టికెట్ కేటాయించకపోయినా తమ కొడుకుకు గాని, కూతురుకు గాని, కోడలకు గానీ టికెట్ కేటాయించమని ఎంతో రిక్వెస్ట్ చేయగా గెలుపు మీద బాగా ధీమా వున్న జగన్ సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించారు.. ప్రత్యక్ష రాజకీయాలలోకి యువకులు రావాలనే ఉద్దేశంతో జగన్ యంగ్ లీడర్స్ అవకాశం ఇచ్చారనీ వైసీపీ చెప్పుకొచ్చింది.. పైగా యంగ్ లీడర్స్ అంతా కూడా ఉన్నత చదువులు చదువుకున్నవారు కావడంతో జగన్ ఆ రిస్క్ తీసుకున్నారు..