పోలీస్ ఉన్నతాధిరులపై ఫిర్యాదు చేసిన నటి జత్వానీ.. ఆ కేసు విషయంలో బెదిరించారంటూ?

frame పోలీస్ ఉన్నతాధిరులపై ఫిర్యాదు చేసిన నటి జత్వానీ.. ఆ కేసు విషయంలో బెదిరించారంటూ?

Reddy P Rajasekhar
కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ ప్రముఖ నటి కాదంబరి జత్వానీ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అయ్యాయనే సంగతి తెలిసిందే. ఏపీ ఉన్నతాధికారులపై ఈ నటి ఆరోపణలు చేయడంతో పాటు తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి వేధించారని నాటి సీపీ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్నీ, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులు అని జత్వానీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
నిన్న రాత్రి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న కాదంబరి జత్వాని ఏసీపీ స్రవంతి రాయ్ ను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేయడంతో పాటు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు వల్ల తనపై అన్యాయంగా కేసు పెట్టి తల్లీదండ్రులను అరెస్ట్ చేశారని కాదంబరి జత్వాని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు విద్యాసాగర్ తో కుమ్మక్కై ఫోర్జరీ పత్రం సృష్టించి తప్పుడు కేసు నమోదు చేసినట్టు కాదంబరి జత్వాని అన్నారు.
 
పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కు తీసుకునే విధంగా ఇబ్రహీంపట్నం స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు జత్వానీ వెల్లడించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన వెంటనే ఆఘమేఘాలపై ముంబై వచ్చి నన్ను, నా తల్లీదండ్రులను అరెస్ట్ చేయడం కుట్రలో భాగమేనని జత్వానీ తెలిపారు. ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు సుదీర్ఘంగా విచారణ జరిపి ముంబైలో కేసును వెనక్కు తీసుకోవాలని బెదిరించారని ఆమె అన్నారు.
 
ఆమె మీడియాతో మాట్లాడుతూ కుక్కల విద్యాసాగర్ పై ఏకంగా 17 క్రిమినల్ కేసులు ఉన్నాయని అలాంటి వ్యక్తికి వైసీపీ నేతలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి నాపై ఆరోపణలు చేయడం తగదని నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేసి పబ్బం గడుపుకోవాలని విద్యాసాగర్ చూస్తున్నారని ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి త్వరగా బయటపడేయాలని కోరుకుంటున్నానని జత్వానీ అన్నారు.
 
దీనికి రాజకీయ రంగు పులమడం అన్యాయమని ఆమె తెలిపారు. కొందరు అధికారులు పరిధి దాటి వ్యవహరించడం వల్లే వారిపై ఫిర్యాదు చేశానని జత్వానీ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ త్వరితగతిన కేసును నమోదు చేసి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆమె అన్నారు. నన్ను అరెస్ట్ చేసిన సమయంలో 10 ఎలక్ట్రానికి పరికరాలను పోలీసులు సీజ్ చేశారని వాటిలో చాలా ఆధారాలు ఉన్నాయని ఇంతవరకు వాటిని తిరిగి ఇవ్వలేదని జత్వానీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: