ఏపీ: పవన్ సవాల్ ను వైసీపీ నేతలు స్వీకరించేనా..?

FARMANULLA SHAIK
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు రాత్రిపగలు తేడాలేకుండా పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటూ.. వారిలో ధైర్యాన్ని నింపుతున్నారని పవన్ అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీరు అందించడం జరుగుతుందని చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనకు తోడుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తున్నారు.ఆహార పదర్థాలు, ఇతర సామాగ్రిని అందించడం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా సహాయ చర్యల్లో పాల్గొంటూ సీఎం బాధితులకు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు.అయితే, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఇక వరద ముంపు ప్రాంతాల్లో జనసేనానిని పర్యటించకపోవడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. తనపై వస్తున్న విమర్శలపై పవన్ స్పందించారు. తనకు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాలని ఉందన్నారు. అయితే, తాను వెళ్లిన చోట అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని, దాంతో బాధితులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు.అందుకే తన పర్యటన బాధితులకు సహాయపడేలా ఉండాలే తప్పితే, ఆటంకంగా పరిణమించకూడదనినిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. 

వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానుకొని సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ సూచించారు. విపత్తు సమయంలో అందరం కలిసి ప్రజల్ని ఆదుకోవాలి. ముందు వైసీపీ సహాయంచేసి అప్పుడు మాపై విమర్శలు చేయండి. ఇళ్లలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని వైసీపీ నేతల తీరును పవన్ విమర్శించారు.నేను గ్రౌండ్ లోకి వస్తే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారుల సూచనతో నేను వెనక్కి తగ్గాను. అలా అని నేను ఏమీ చేయడం లేదని అనడం సరికాదు. పవన్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించే వైసీపీ నేతలు నాతో ఒక్కసారి వచ్చి చూడండి.. నేను ఏం చేస్తున్నానో మీకే అర్థమవుతుందంటూ పవన్ అన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించేలా రాజకీయ నాయకులు ప్రవర్తించాలి. ఇప్పటికైనా విమర్శలు మానుకొని వైసీపీ నేతలు ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయం అందించాలని పవన్ సూచించారు.దీనిపై పవన్ స్పందిస్తూ.. ఇంట్లో కూర్చుని లైవ్ వీడియోల్లో మాట్లాడటం చాలా సులభం అని.. ఒకవేళ వైసీపీ నేతలకు ఓకే అయితే తన కాన్వాయ్‌లో కూర్చోపెట్టుకుని స్వయంగా తీసుకెళ్తానని అప్పుడు వారికి తెలుస్తుందని సెటైర్ వేసారు. ఈ సమయంలో రాజకీయం చేయకుండా మన రాష్ట్రానికి వచ్చిన కష్టం అని భావించి డబ్బులు సాయం చేస్తే బాగుంటుందని అన్నారు. ఈ గ్యాప్‌లో ఓ విలేకరి జగన్ కోటి వరకు సాయం చేసారు సర్ అని చెప్పగా.. ఆ మంచిది. చేస్తే మంచిదే అని పవన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: