కంప్లీట్ రెస్ట్ మోడ్‌లో వైసీపీ లీడర్స్.. ఏపీలో ఏం జరుగుతుంది.. !
- కేడర్ లో పూర్తి నైరాశ్యం
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. జనాలు టీడీపీ కూటమిని గెలిపించారు అనుకుంటూ వైసీపీ నేతలు విశ్రాంతి మోడ్ లోకి వెళ్లిపోయారు. పార్టీ ఓడిపోయి మూడు నెలలు గడిచినా.. వారు ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రావడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసిపి నేతలలో ప్రస్టేషన్ పూర్తిగా కనిపిస్తోంది. పార్టీ అధికారం ఉన్నప్పుడు అంత తామే అన్నట్టుగా వ్యవహరించిన వారు.. ఇప్పుడు గప్‌చుప్ అయ్యారు. ఎక్కడ ఎవరు ఉంటున్నారు కూడా తెలియటం లేదు అన్నది కార్యకర్తల మాట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గట్టిగా నిలబడి నడిపించాల్సిన అవసరం ఉందని.. కానీ వైసీపీ నేతలు మాత్రం ఎలాంటి చడి చప్పుడు చేయటం లేదని వాపోతున్నారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ తరఫున పోరాటం చేయాలని ఉంది. కానీ.. నాయకులు సరైన దిశానిర్దేశం చేయడం లేదు.
ఇటీవల ముగిసిన గ్రామసభలలో వైసిపి మద్దతుదారులైన సర్పంచ్లను.. వేదిక ఎక్కి అవమానించిన పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదన్న అసహనం కార్యకర్తలు ఉంది. పార్టీ అభిమానంతో కూటం నుంచి వచ్చే సవాళ్లకు జవాబు ఇస్తున్నా .. వారి బలం సరిపోవటం లేదు. ఎమ్మెల్యేలు , ఎంపీలు , మంత్రులుగా చేసిన వారు మాత్రం సైలెంట్ అయిపోయారు. చాలామంది పట్టించుకోకపోవడంతో పార్టీ కార్యకర్తలు నాయకులలో కూడా ఒక విధమైన నైరాశ్యం కలుగుతుంది. ఏది ఏమైనా అధినాయకత్వం పార్టీని మొత్తం ప్రక్షాళన చేయాలని కార్యకర్తల కోరుతున్నారు.
పార్టీ అధినేత జగన్ పై స్థాయి నుంచి ఒక్క సారి గా పెద్ద ఎత్తున ప్రక్షాళన చేస్తే తప్పా పార్టీ బతికి బట్ట కట్టలేదని పార్టీ వీరాభిమానులే చెపుతోన్న పరిస్థితి. మరి జగన్ ఎంత త్వరగా పార్టీ ప్రక్షాళనకు నడుం బిగిస్తే అంత మంచిదనే చెప్పాలి.