* 50 ఏళ్ల సినీ చరిత్ర.. 109 సినిమాలు.. ఎన్నో విభిన్న పాత్రలు.. ఇది బాలయ్య ట్రాక్ రికార్డ్
* ఘట్టమేదైనా, పాత్ర ఏదైనా బాలయ్య పెర్ఫార్మన్స్ పీక్స్ లెవెల్
* ఈ తరం హీరోలకు ఇన్స్పిరేషన్ గా బాలయ్య.
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన థియేటర్ లో “జై బాలయ్య “ స్లోగన్ వినపడాల్సిందే..బాలయ్య అంటే ఫ్యాన్స్ లో అంత ఇంపాక్ట్ ఉంది. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన బాలయ్య సరికొత్త చరిత్ర సృష్టించారు..తాతమ్మకల సినిమాతో బాలయ్య సినీ రంగప్రవేశం జరిగింది.. మొదటి చిత్రంలోనే తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న బాలయ్య తండ్రితో పాటు ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు..ఆ తరువాత వరుసగా సినిమాలు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే బాలయ్య నటుడిగా మారి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి.
50 సంవత్సరాలు హీరోగా అదే చరిష్మాతో నట ప్రస్థానాన్ని ఇప్పటికీ కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు.బాలయ్య సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్, ఇండస్ట్రీ హిట్ మూవీస్ అందించాడు.అయితే ఆయన కెరీర్ లో హిట్స్ తో పాటు మధ్యలో ఎన్నో ఫ్లాపులు మరెన్నో డిజాస్టర్లు వచ్చినా కూడా ఆయన క్రేజ్ ని ఏమాత్రం తగ్గించలేదు. బాలయ్య తన కెరీర్ లో తన స్థాయి నటులు ఎవ్వరు కూడా చేయనన్ని పాత్రలు చేసి మెప్పించారు.. ఆయన ఒక పాత్ర చేస్తున్నారంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రను సహజ శైలిలో అద్భుతంగా రక్తి కట్టిస్తారు.. ఇప్పటికీ కూడా బాలయ్య డైలాగ్ డెలివరీలో ఆ హోరు, ఆజోరు ఏ మాత్రం తగ్గలేదు..
ప్రస్తుతం వున్న యంగ్ హీరోలంతా కూడా బాలయ్య రేంజ్ మాస్ ఇమేజ్ కోసం తెగ తంటాలు పడుతున్నారు.. అయితే బాలయ్య మాత్రం యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. బాలయ్య సినిమా వచ్చిందంటే చాలు బాలయ్య అభిమానులు చేసే హంగామా అంతా ఇంత కాదు.. బాలయ్య తన కెరీర్ లో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలు కూడా చేసి మెప్పించారు. జానర్ ఏదైనా బాలయ్య దిగితే హిస్టరీ రిపీట్ అవ్వాల్సిందే.. అయితే బాలయ్యకు కొన్ని డ్రీమ్ రోల్స్ ఉన్నాయట.. ఎప్పటికైనా ఆ రోల్స్ లో నటించాలని బాలయ్య కోరిక.. ఇంతకీ బాలయ్య డ్రీమ్ రోల్స్ ఏమిటంటే..
చంఘీజ్ ఖాన్, గోన గన్నారెడ్డి, రామానుజాచార్య వంటి పాత్రలంటే బాలయ్య కి ఎంతో ఇంట్రెస్ట్ కానీ సరైన కథలు దొరకక అవి కార్యరూపం దాల్చలేదు..అయితే బాలయ్య గతంలో నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా బాలయ్యకు నటుడుగా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా ఎన్నో అవార్డ్స్ అందుకుంది.. బాలయ్య నటించిన ప్రతి పాత్ర కూడా హిస్టరీ క్రియేట్ చేసింది..భారతదేశంలోనే ఇలా 50 ఏళ్ల పాటు నటుడిగా కొనసాగిన అత్యంత కొద్ది మందిలో నందమూరి బాలకృష్ణ కూడా చోటు సంపాదించుకున్నారు.త్వరలోనే మరిన్ని విభిన్న పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడానికి సిద్ధంగా వున్నారు.