ఒట్టు నేను పార్టీ మారాను: మహిపాల్ రెడ్డి ఇచ్చిన షాక్‌కి గుండె పగిలిన బీఆర్‌ఎస్‌..

Suma Kallamadi
* బీఆర్‌ఎస్‌ నేతలకు భారీ షాకులు ఇస్తున్న ఎమ్మెల్యే
* అన్నం పెట్టిన వారికే కన్నం వేస్తున్నారు  
* గూడెం మహిపాల్ రెడ్డి జంప్ చేయడం పెద్ద షాక్  
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేత చాలా సీనియర్ అని చెప్పుకోవచ్చు. 1991లో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన మహిపాల్ రెడ్డి ట్రేడ్ యూనియన్ లీడర్ గా పటాన్‌చెరు ఎంపిటీసిగా, మెదక్ జిల్లా ఎంపిటీసి సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ పదవులు చేపట్టారు. తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ కూడా చేశారు. ఓడిపోవడంతో  2009లో బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో బీఆర్‌ఎస్‌ కండువ కప్పుకున్నారు. 2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో సమీప టీడీపీ అభ్యర్థి స్వప్న దేవ్ పై 18,886 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
2018 ముందస్తు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ పై 37,699 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరవేశాడు. ఇలా బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలిచారు. ఆయన రాజకీయ జీవితం విజయవంతంగా కొనసాగడంలో బీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించింది. బీఆర్‌ఎస్‌ కారణంగానే ఆయన రెండుసార్లు అసెంబ్లీకి వెళ్ళగలిగారు. బీఆర్‌ఎస్‌ 2023 ఎన్నికల్లో ఓడిపోయింది కానీ ఆయన మాత్రం తన నియోజకవర్గం గెలిచారు. ఎమ్మెల్యేగా రాజభోగాలను అనుభవించారు. అలా ఆయనకు మంచి రాజకీయ జీవితం అందించిన బీఆర్ఎస్ కే ఆయన వెన్నుపోటు పొడిచారు నేను పార్టీ మారను అని చెబుతూ వస్తూ చివరికి కాంగ్రెస్ పార్టీలోకి జంపు చేశారు.
గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని కలిసిన తర్వాత బీఆర్ఎస్ అగ్ర నేత హరీష్ రావు కంగుతున్నారు. కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లు అయింది. మహిపాల్ రెడ్డి భారత్ రాష్ట్ర సమితిలో ఉంటు వరుసగా మూడు సార్లు పటాన్ చెరు శాసన సభ నియోజక వర్గం నుంచి గెలిచి 2024, జులై 15 సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ కండువా కప్పు కున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: