వైసీపీ బీద మస్తాన్ రావు షాకివ్వడానికి కారణాలివే.. జగన్ పై విమర్శలు చేయలేదు కానీ?
ఎలాంటి ప్రలోభాలు లేకుండా తమ రాజీనామా జరిగిందని బీద మస్తాన్ రావు కామెంట్లు చేయడం జరిగింది. ఇన్నిరోజుల పాటు పార్టీలో గౌరవం అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు తమ బాస్ అని రాజకీయాలలో ఉన్న సమయంలో ఎవరెవరినో కలవడం జరుగుతుందని ఆయన వెల్లడించడం గమనార్హం.
మళ్లీ ఛాన్స్ వస్తే తాను రాజ్యసభకు వస్తానని బీద మస్తాన్ రావు కామెంట్లు చేశారు. రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా బీద మస్తాన్ రావుకు పేరుంది. జడ్పీటీసీ సభ్యునిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన ఏపీ శాసన సభ సభ్యునిగా కూడా పని చేశారు. కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన తర్వాత రోజుల్లో వేర్వేరు పదవులలో పని చేసి వార్తల్లో నిలవడం జరిగింది.
ప్రముఖ నేతలు పార్టీకి వరుస షాకులు ఇస్తుండటం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోవడమే నేతల పార్టీల మార్పులకు కారణమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. నేతలు ఐదేళ్లు పదవులకు దూరంగా ఉండటం అంటే సాధారణ విషయం కాదు. అందువల్లే చాలామంది నేతలు ఇతర పార్టీలపై దృష్టి పెడుతున్నారు. బీద మస్తాన్ రావు రాజీనామా చేయడంతో పార్టీ ఒక మంచి నేతను దూరం చేసుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది అయితే కాదని చెప్పవచ్చు.