జగన్ ఎగ్ పఫ్స్ బిల్లు రూ. 3.6 కోట్లా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి?
ఎన్డీయే ప్రభుత్వం గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో రోజురోజుకూ మరిన్ని షాకింగ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి కార్యాలయం తన సిబ్బందికి ఎగ్ పఫ్‌ల కోసం రూ.3.62 కోట్లు ఖర్చు చేసిందనే విషయం తాజాగా బయటపడింది.
సగటున, ఈ స్నాక్స్ కోసం ప్రభుత్వం సంవత్సరానికి 72 లక్షలు ఖర్చు చేసింది. అంటే సీఎం ఆఫీస్ రోజూ 993 ఎగ్ పఫ్‌లను సరఫరా చేసింది. అంటే ఐదేళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్‌లను వినియోగించారని నివేదిక పేర్కొంది. ఇది ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కాదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సీఎం కార్యాలయ సిబ్బందికి ఎగ్ పఫ్స్ కోసం చేసిన ఖర్చు ఇప్పుడు సంచలనంగా మారింది. గత ఐదేళ్లలో జగన్ ఇంకెన్ని విలాసాల కోసం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారో అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అతని దుబారా ఖర్చు ఇప్పటికే వివిధ రూపాల్లో వెల్లడైంది. వీటిలో భద్రతా సిబ్బందిని పెంచడం, రుషికొండ ప్యాలెస్ నిర్మాణం, చిన్న పర్యటనలు, వ్యక్తిగత విహారయాత్రల కోసం ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లను ఉపయోగించడం చేశారు. జగన్, తన కుటుంబ ప్రయోజనాల కోసం కూడా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు.
'ఎగ్ పఫ్' రిపోర్ట్ బయటికి వచ్చాక సోషల్ మీడియాలో వైసీపీ పార్టీని టీడీపీ తమ్ముళ్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది ఇప్పుడు ఆయన్ను "వెరీ గుడ్డు" జగనన్న అని హేళన చేస్తున్నారు.