తండ్రికి తగ్గ తనయుడని ప్రూవ్ చేసుకున్న హరికృష్ణ.. పాలిటిక్స్ లో సైతం అదరగొట్టారుగా!
సినీ గ్లామర్ తో ఆయన పాలిటిక్స్ లో సైతం సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు హరికృష్ణ మూడో సంతానం కాగా రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్య సభ సభ్యుడిగా హరికృష్ణ పని చేశారు. 1995 సంవత్సరంలో టీడీపీలో సంక్షోభం ఏర్పడిన సమయంలో తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబును సమర్ధించి క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా హరికృష్ణ వార్తల్లో నిలిచారు.
1996 సంవత్సరంలో సీనియర్ ఎన్టీఆర్ మరణంతో హిందూపురం అసెంబ్లీ స్థానం ఖాళీ కాగా ఆ సమయంలో హరికృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 1999లో చంద్రబాబుతో విబేధించి అన్న తెలుగుదేశం పేరుతో మరో పార్టీని ఆయన స్థాపించారు. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశంలో చేరిన హరికృష్ణ 2008 సంవత్సరంలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
అదే సంవత్సరం హరికృష్ణను టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా సిఫారసు చేయడం జరిగింది. అప్పటినుంచి మరణించే వరకు ఆయన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారని తెలుస్తోంది. ఆగస్టు 22, 2013 లో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. 2014 ఎన్నికల్లో పోటీకి ఆయన దూరంగా ఉన్నారు. 2018 సంవత్సరం ఆగష్టు నెల 29వ తేదీన యాక్సిడెంట్ లో హరికృష్ణ మృతి చెందారు. హరికృష్ణ కొడుకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.