తెలుగు పొలిటికల్ ట్రోలింగ్: రేవంత్ రెడ్డి లాగా ఏ ముఖ్యమంత్రి ట్రోలింగ్ ఫేస్ చేయలేదేమో..?
• సీఎం అయ్యాక రేవంత్ రెడ్డిని దారుణంగా ట్రోలింగ్
• ప్రతిపక్షాలను విమర్శిస్తూ ఆయనా విమర్శల పాలవుతున్నారు
• ఆయనపై ఎన్నో ఫన్నీ మీమ్స్
( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉంటారు అలాగే ఎక్కువగా ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడుతుంటారు. ముఖ్యమంత్రి కాబట్టి చాలా సమావేశాల్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఇలా మాట్లాడే మాటలు కొన్ని వింతగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మెడలో వేసుకుంటా అని అంటారు. " మెడలో పేగులు వేసుకొని తిరగడం ఏంటిరా హౌ*, నువ్వేమైనా బోటీ కొట్టుకునేటోడివా?" అంటూ కేటీఆర్ ఓసారి దారుణంగా ట్రోల్ చేశారు.
ఓ టీవీ షోలో గుడ్లగూబ కాళ్ళు పైకి ఎత్తి తల కిందకి పెట్టి పడుకుంటుంది అని రేవంత్ రెడ్డి అన్నారు నిజానికి గబ్బిలం అలా పడుకుంటుంది గుడ్లగూబ తలకిందులుగా పడుకోదు. మన సీఎంకి ఈ విషయం కూడా తెలియదా అని నెటిజన్లు అప్పట్లో ఒక ఆట ఆడుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో "రాజకీయాల నేతలు బూతులు మాట్లాడుతున్నారు. ఈ బూతులు ఎప్పుడు మానేస్తారు సార్?" అని ప్రశ్నిస్తే.. "మాట్లాడే వాళ్లు మాట్లాడతారు. మీరు వాటిని ప్రసారం చేయవద్దు. ప్రసారం చేస్తే జైలుకు పంపిస్తా" అని రేవంత్ రెడ్డి రివర్స్ మాట్లాడారు. బూతులు మాట్లాడితే తప్పులేదు కానీ వాటిని ప్రసారం చేస్తే తప్పు అన్నట్లు ఆయన మాట్లాడిన తీరు కూడా ట్రోలింగ్కి తీసింది.
సీఎం హోదాలో ఉండి "నా కొ*కల్లారా" లాంటి పచ్చి బూతులు మాట్లాడుతూ కూడా ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. "సార్ వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నాను. వారి కుటుంబాలు ఏమైపోవాలి." అని ఒక మీటింగ్లో అడిగితే పేర్లు చెప్పండి డబ్బులు వేద్దామంటూ చాలా ఇన్సెన్సిటివ్గా రిప్లై ఇచ్చారు. సమయంలో కూడా ఇతన్ని ఏకిపారేశారు.
సభ ఎన్నికల ప్రచారంలో ఆయన వెళ్ళిన చోట అహం కరెంటు కట్ అయింది. ఓ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇస్తున్న హామీలన్నీ వస్తున్నాయి కదా అని ప్రశ్నిస్తే ప్రజలు నోరు మెదపలేదు అది కూడా ఆయనకు ఒక పెద్ద అవమానం లాగా ఎదురు తగిలింది. రాహుల్ గాంధీ పప్పా మీరు పప్పా అని అడిగితే ఇద్దరం పప్పు లమే అన్నట్లు ఆయన హిందీలో ఒప్పుకొని షాకిచ్చారు. ఇంకా సరిగా ఇంగ్లీష్ మాట్లాడటం రాక కూడా ఆయన ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డిని ట్రోల్ చేసిన సందర్భాలు లెక్కలేనన్ని వస్తాయి.