ఆ రేషన్ కార్డులు కట్ చేస్తున్న కూటమి సర్కార్.. వాళ్లు జాగ్రత్త పడక తప్పదా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ అర్హులకే పథకాలు అందాలనే సదుద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మళ్లీ చంద్రన్న కానుకలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం అందుతోంది. రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుకలను లబ్ధిదారులకు ఫ్రీగా అందించేలా కూటమి సర్కార్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
 
ఈ స్కీమ్ కోసం ఏకంగా 538 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని భోగట్టా. ఐదేళ్ల పాటు ఈ స్కీమ్ అమలు చేయాలంటే దాదాపుగా 2700 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కందిపప్పు, పామాయిల్, నెయ్యి, శనగపప్పు, గోధుమపిండి ఉచితంగా అందించడం జరుగుతుంది. మరోవైపు అనర్హుల రేషన్ కార్డులు కట్ చేసే దిశగా కూటమి నేతల అడుగులు పడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
గత 6 నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని వ్యక్తుల రేషన్ కార్డులను కట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లక్షా 36 వేల 420 కార్డుదారులు గత 6 నెఅల్లుగా రేషన్ సరుకులను తీసుకోవడం లేదని సమాచారం అందుతోంది. ఆ కార్డులను తొలగించి అర్హత ఉండి రేషన్ కార్డ్ లేనివాళ్లకు కొత్త కార్డులను మంజూరు చేయాలని ఏపీ పభుత్వం భావిస్తుండటం గమనార్హం.
 
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, చక్కెరతో పాటు అదనపు సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బాబు సర్కార్ గతంతో పోల్చి చూస్తే ఎక్కువ సంఖ్యలో సరుకులను పంపిణీ చేసే దిశగా అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రేషన్ కార్డు ద్వారా సబ్సిడీ ధరలకే సరుకులు అందుతుండటంపై ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుండటం గమనార్హం.  రేషన్ కార్డ్ లేకపోతే కొన్ని బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉండదు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: