విజయ్ దేవరకొండకు తృటీలో తప్పిన ప్రమాదం..ఆందోళనలో ఫ్యాన్స్..!

FARMANULLA SHAIK
ఇటీవలే 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో హీరో విజయ్ గాయపడినట్లు తెలుస్తోంది.విషయమేమిటంటే నటుడు విజయ్ దేవరకొండ మెట్ల మీద జారిపడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరై వస్తుండగా విజయదేవరకొండ కాలు స్లిప్ అయినట్లు తెలుస్తుంది. ఆ వీడియోను రికార్డు చేయవద్దని ఆయన టీమ్ రిక్వెస్ట్ చేస్తూ చేతులు అడ్డుపెట్టడం అందులో కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు ఏమైందని కంగారు పడిపోతున్నారు.విజయ్ కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఇదిలావుండగా ఇప్పటికే VD12 నుంచి విడుదలైన పోస్టర్స్ లో విజయ్ లుక్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారనే టాక్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఇంతకుముందు వచ్చిన లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో   VD12 విజయ్ కంబ్యాక్ ఫిల్మ్ కాబోతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు రౌడీ భాయ్ ఫ్యాన్స్. ఇటీవలే విజయ్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ 'కల్కి 2898 AD' లో క్యామియో రోల్లో కనిపించారు. అర్జునుడు పాత్రలో కనిపించి ఫ్యాన్స్ ను అలరించారు.కాని సినిమాల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు విజయ్. తన ప్రయత్నం తాను గట్టిగా చేస్తున్నాడు.విజయ్ దేవరకొండ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా విజయ్ తో సినిమాకురెడీ అంటున్నాయి. ఎన్ని ప్లాప్ లు వచ్చినా.. విజయ్ దేవరకొండ ఇమేజ్ మాత్రం ఏమాతమరం తగ్గలేదు. దాంతో ఆయనతో సినిమాకు సై అంటున్నారు స్టార్ ప్రొడ్యూసర్లే. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమా హిట్ అయితే.. విజయ్ కాస్త ఊపిరి పిల్చుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: