సినిమా ఇండస్ట్రీలో ఒక కథ ఒకరి కోసం అనుకొని రాసుకున్నాక కొన్ని కారణాలవల్ల అదే కథను వేరే వారితో తెరకెక్కించిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా చిరంజీవి కోసం తయారు చేసిన కథలో మోహన్ బాబు హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అసలు ఆ సినిమా ఏది ..? చిరంజీవి కోసం తయారు చేసిన కథలోకి మోహన్ బాబు ఎలా ఎంట్రీ ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు "అల్లుడు గారు" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. శోభన హీరోయిన్గా నటించిన ఈ మూవీ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా కథను మొదట చిరంజీవి కోసం రాఘవేంద్రరావు రాయడం మొదలు పెట్టాడట. కొంత భాగం కథ పూర్తి అయిన తర్వాత ఒకానొక సందర్భంలో చిరంజీవికి ఈ సినిమా కథను కూడా వినిపించాడట. కథ సూపర్ గా ఉంది సార్ ఎవరికోసం రాస్తున్నారు అని చిరంజీవి అడగ్గా వేరే ఎవరికోసమో కాదు నీకోసమే ఈ కథ రాస్తున్నాను అని అన్నాడట. మరికొన్ని రోజుల్లోనే కథ పూర్తి అవుతుంది. అయ్యాక సినిమా స్టార్ట్ చేద్దాం అని అన్నాడట. ఒకే సారి కథ మొత్తం అయ్యాక చెప్పండి అని చిరు అన్నడట. ఇక కథ మొత్తం అయ్యాక రాఘవేంద్రరావు ఒక రోజు చిరంజీవికి ఫోన్ చేసి నీకు చిన్న లైన్ గా చెప్పిన కథ మొత్తం పూర్తి అయింది అని అన్నాడట.
ఒకే సార్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అని చిరంజీవి అడగగా నీపై ఈ సినిమా వర్కౌట్ కాదు ... అన్నాడట. ఎందుకు సార్ అనగా ... ఆ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోతాడు. నీలాంటి స్టార్ హీరో పై ఆ సీన్ వర్కౌట్ కాదు. సినిమా ఫ్లాప్ అవుతుంది. వేరే వారితో చేయడం కరెక్ట్ అన్నాడట. ఒకే సార్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి అని చిరు చెప్పాడట. అలా చిరు కోసం రాసుకున్న కథతో మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు సినిమా తీసినట్లు తెలుస్తోంది.