పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఈ మూవీ ద్వారా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలతోనే పవన్ అద్భుతమైన విజయాలు అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా మారిపోయాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్ ప్రారంభంలో నటించిన చాలా సినిమాలకు మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేశాడు.
ఈయన పవన్ సినిమాలకు పని చేసిన మూవీలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా మార్తాండ్ కే వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా పవన్ కెరియర్ ప్రారంభంలో ఎలా ఉండేవాడు అనే వివరాలను తెలియజేశాడు. మార్తాండ్ కె వెంకటేష్ , పవన్ గురించి మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ కెరియర్ లో నేను చాలా సినిమాలకు ఎడిటర్ గా పని చేశాను. ఆయన సినిమాల గురించే ఎక్కువగా ఆలోచించేవాడు. చాలా మంది హీరోలు సినిమా పూర్తి అయిన తర్వాత ఎడిటింగ్ కి రూమ్ కి పెద్దగా వచ్చేవారు కాదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా పూర్తి అయ్యాక ఎడిటింగ్ రూమ్ లో చాలా సమయం గడిపేవాడు.
ప్రతి సీన్ గురించి అడిగి తెలుసుకునేవాడు. అలా ఆయన ఎడిటింగ్ రూమ్ లోనే ఎక్కువ సమయం గడపడంతో ఆయన నాకు చాలా క్లోజ్ అయ్యాడు. మేమిద్దరం కలిసి చాలా సినిమాల గురించి కూడా మాట్లాడుకునే వాళ్ళం. ఆయన అంతగా సినిమాల గురించి పట్టించుకునే వాడు కాబట్టే అద్భుతమైన విజయాలు ఆయన కెరియర్ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు అని మార్తాండ్ కే వెంకటేష్ చెప్పుకొచ్చాడు.