ప్రేమదేశం హీరో వినీత్ భార్య ఎవరంటే..? వైరల్ గా మారిన ఫ్యామిలీ ఫొటోస్.. !
అన్నట్లు వినీత్ హీరో గానే కాకుండా మంచి డాన్సర్ కూడా.. ముఖ్యంగా భరతనాట్యంలో ఎన్నో కచేరిలలో తన ప్రతిభను ప్రదర్శించాడు. అలాగే ఇండస్ట్రీలో భరతనాట్య కళాకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు . ఆయన సినిమాల విషయం పక్కన బడితే.. 2004 ఆగస్టు 8న చెన్నైకు చెందిన ప్రిస్సిల్లా మీనన్‌ను పెళ్లి చేసుకున్నారు.. ఇక వీరికి అవంతి వినీత్ అనే పాప కూడా జన్మించింది. వినీత్ ఫ్యామిలీ సాధారణంగా బయట ఎక్కడ కనిపించదు. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలలో వినీత్ ఫ్యామిలీ కనిపించదు .
కానీ తాజాగా ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినీత్ , ప్రిస్సిల్లాది పెద్దలు కుదిర్చిన వివాహం . ప్రిస్సిల్లా బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో పనిచేస్తున్నారు . వీరిద్దరి వివాహ రిసెప్షన్ వేడుక సెప్టెంబర్ 5, 2004 న జరిగింది . చెన్నై లో జరిగిన వేడుక కు సినీ రంగాని కి చెందిన స్నేహితులు హాజరయ్యారు . వినీత్ మరోసారి సినిమాల్లో కి రీ ఎంట్రీ ఇవ్వాల ని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు . ఇక మరి వినీత్ రాబోయే రోజులై నా సినిమా లో నటిస్తారో లేదో చూడాలి .