కొత్త తెలుగు రహదారులు:మోడ్రన్ ఎక్స్ ప్రెస్ వేగా మియాపూర్ సంగారెడ్డి రోడ్డు..!

frame కొత్త తెలుగు రహదారులు:మోడ్రన్ ఎక్స్ ప్రెస్ వేగా మియాపూర్ సంగారెడ్డి రోడ్డు..!

Pandrala Sravanthi
- రహదారుల నిర్మాణానికి పెద్దపీట.
- సరికొత్త మోడల్ లో మియాపూర్ సంగారెడ్డి రోడ్డు.

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలావరకు  అభివృద్ధి జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నేషనల్ హైవేలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ వేలు కూడా  నిర్మాణం జరిగాయి. అలా అద్భుతమైన రోడ్డు మార్గాలు మాత్రం వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఆ విధంగా మియాపూర్ నుంచి సంగారెడ్డికి  ఆరు వరసల రోడ్డు  ఇప్పటికే మొదలైపోయింది. కేవలం 31 కిలోమీటర్లు మాత్రమే వేసే ఈ రోడ్డుకు  వేలాది కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారట. మరి ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కారణం ఏంటో తెలుసుకుందాం.
 మియాపూర్ to సంగారెడ్డి:
 మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు 31 కిలోమీటర్ల దూరంతో ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం  జరుగుతోంది. అలాంటి ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపుగా 1297రూపాయల వ్యయం అవుతుందని తెలుస్తోంది. ఇంత తక్కువ కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డుకు అంత ఖర్చు ఎందుకు అవుతుంది అని చాలామందికి డౌట్ రావచ్చు. ఇంత తక్కువ డిస్టెన్స్ లో ఉన్న ఈ రోడ్డుకు మధ్య మధ్యలో అనేక నిర్మాణా పనులు చేయాల్సి ఉంటుందట. ఈ ప్రధాన రోడ్డు వెంబడి సర్వీస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్ పాసులు, కల్వర్టులు  ఇలా అనేక పనులు చేయాల్సి ఉంటుందట. అంతేకాదు ఎక్స్ప్రెస్ వే అంటే ఇలా ఉండాలి అనే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారట. నిజానికి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మోడ్రన్ ఎక్స్ప్రెస్ వేగా నిలవబోతోందని తెలుస్తోంది.

హైదరాబాదు నుంచి పూణే జాతీయ రహదారి వెంట  మియాపూర్ సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం  ఎక్స్ప్రెస్ తరహాలో ముస్తాబ్ అవ్వనుంది. హైదరాబాదులోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యుడి విభాగం ఈ రోడ్డును అభివృద్ధి చేయనుంది. దీనికి జాతీయ రోడ్ల రవాణా శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదం కూడా తెలిపిందట. సరిగ్గా రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ విధంగా ఈ రోడ్డు నిర్మాణం జరిగితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలలోని చాలావరకు ప్రజలు డెవలప్ అవుతారు భూముల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. అంతేకాకుండా ప్రయాణికుల రాకపోకలు పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఉపాధి లభిస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు ప్రత్యేకమైనటువంటి ఫండ్ కేటాయిస్తూ  ప్రభుత్వం దూసుకుపోతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: