అక్కడ ఫ్యాన్ తిరగనంటోందా... అబ్బయ్య చౌదరి నాకొద్దు బాబోయ్ అంటున్నాడా..?
పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో ఏలూరు జిల్లాలో వైసీపీ నాయకులు మాకు పదవులు కావాలి.. మాకు పదవులు కావాలి అని తన్నులాడుకున్న పరిస్థితి. ఎప్పుడు అయితే పార్టీ ఘోరంగా ఓడిపోయిందో ? ఆ పార్టీ నుంచి కేలకనేత్ర అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రిగా మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడంతో పాటు ప్రస్తుతం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళ నాని తన పదవులతో పాటు వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవి ఇస్తామంటుంటే ఏ వైసీపీ నేత కూడా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గతంలో ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పుప్పాల వాసు బాబు - దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి .. ఇలా ఎవరు కూడా ఈ పదవి మాకు వద్దు బాబోయ్ అని అంటున్నారట. జగన్కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న అబ్బయ్య చౌదరికి ఈ పదవి ఇద్దామని అంటున్న చౌదరి కూడా ఈ పదవి తీసుకునేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జెట్టి గురునాథరావు లేదా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ భర్త ప్రసాదరావు పేర్లు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.