ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త.. 48 గంటల్లోనే ఆ నగదు జమ కానుందా?
వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడిందని ఆయన కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ పాలనలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆయన విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 1674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఉంచిందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కష్ట కాలంలో ఉన్నా గత నెలలో 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మిగిలిన 674 కోట్ల రూపాయల విడుదల దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. గత సర్కార్ రైతులకు గోతాలు కూడా అందజేయలేదని నాదెండ్ల తెలిపారు.
ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లో రైతుల ఖాతాలలో డబ్బులు వేస్తామని మంత్రి తెలిపారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని ధాన్యం కొనుగోలు విషయంలో ఏ మాత్రం వెనుకాడబోమని ఆయన చెప్పుకొచ్చారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏపీ రైతులకు ప్రయోజనం చేకూరేలా ఎక్కువ పథకాలను అమలు చేస్తామని ఏపీ టీడీపీ సర్కార్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఆ పథకాల అమలు దిశగా అడుగులు పడనున్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం.