50 ఏళ్ల ఈనాడుకు అదొక్కటే మైనస్.. ఆ ఒక్క విషయంలో విమర్శలు తప్పలేదుగా?

Reddy P Rajasekhar
ఈనాడు దినపత్రిక ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఒక పత్రికను 50 సంవత్సరాల పాటు నడపడం సాధారణమైన విషయం కాదు. 50 సంవత్సరాల ఈనాడు ఒక తరాన్ని శాసించిన అక్షరం అని భావించే వాళ్లు సైతం ఎంతోమంది ఉన్నారు. ఈనాడులో ఒక వార్త ప్రచురితమైందంటే ఆ వార్త నూటికి నూరు శాతం నిజమై ఉంటుందని చాలామంది నమ్ముతారు.
 
అలాంటి ఈనాడుకు ఒకే ఒక్క విషయంలో మాత్రం విమర్శలు తప్పలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రప్రదేశ్ కు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ నేతలను ఈనాడు పదేపదే టార్గెట్ చేసిందని సామాన్య జనాలలో చాలామంది భావిస్తున్నారు. 50 ఏళ్ల ఈనాడుకు అదొక్కటే మైనస్ అని ఎక్కువమంది కామెంట్లు చేస్తున్నారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కానీ వైఎస్ జగన్ గురించి కానీ ఈ పత్రికలో పాజిటివ్ కథనాలు చాలా అరుదుగా మాత్రమే వచ్చాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ పాలన విషయంలో ఈనాడు పదుల సంఖ్యలో కథనాలను ప్రచురించి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒక రాజకీయ పార్టీకి ఈనాడు ఎప్పుడూ అనుకూలంగా పని చేస్తుందని ఏపీ ఓటర్లలో చాలామంది ఫీలవుతున్నారు.
 
అయితే ఈ ఒక్క విషయాన్ని మినహాయిస్తే మిగతా విషయాల్లో మాత్రం ఈనాడుకు ఈనాడే సాటి అని చెప్పవచ్చు. ఎక్కువగా ఇంగ్లీష్ పదాలను వాడకుండా కథనాలను ప్రచురించడం ఈనాడు ప్రత్యేకత అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు. ఈనాడు పత్రికను నంబర్ వన్ గా నిలబెట్టడానికి రామోజీరావు పడిన కష్టం మాత్రం అంతాఇంతా కాదని చెప్పవచ్చు. ఈనాడు ఎంతోమంది జర్నలిస్టుల జీవితాలను సైతం మార్చేసిందని చాలామంది ఫీలవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: