కూటమిలో కుంపట్లు: నామినేటెడ్ పోటు.. పదవుల కోసం తిరుగుబాటు.!

Pandrala Sravanthi

- నామినేటెడ్ పదవుల పై తీవ్ర కసరత్తు..
- ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిన పరిస్థితి..
- చంద్రన్న అందరికీ న్యాయం చేస్తారా.?

 ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఏం నడుస్తుందయ్యా అంటే నామినేటెడ్ పదవుల జాతర నడుస్తుంది అని చెప్పవచ్చు. అద్భుతమైన మెజారిటీతో  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  దీంతో పలు పార్టీల నాయకులు మావల్లే టిడిపి పార్టీ గెలిచిందని కాదు కాదు మావల్లే గెలిచిందని మరో పార్టీ ఇలా ఏ పార్టీ నాయకులు ఆ పార్టీని పొగుడుతున్నారు. దీంతో చంద్రబాబుకు ఏ పార్టీకి ఎక్కువ పదవులు ఇవ్వాలి ఏ పార్టీకి తక్కువ పదవులు ఇవ్వాలి అనేదానిపై  తర్జనా భర్జనా పడుతున్నారట. ఇప్పటికే జనసేన, బిజెపి పోటీ చేసిన స్థానాల్లో  క్యాండిడేట్లు టికెట్ త్యాగం చేసుకున్నారు.  అలాంటి ఈ ఈ పరిస్థితుల్లో ముందుగా వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు,ఎమ్మెల్సీ పదవులు అందించాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా  పలు నియోజకవర్గాల్లో కొంతమంది పార్టీ కోసం కష్టపడి ఎలాంటి పదవులు పొందని వారు ఉన్నారట. అయితే వారికి కూడా పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారట.  ఈ విధంగా పదవుల విషయంలో ఒక్కో పదవికి ఇద్దరు ముగ్గురు లేదంటే పది మంది దాకా పోటీ రావడంతో ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది.

 నామినేటెడ్ పోటు:
కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు, డిప్యూటీ స్పీకర్ కాల్వ శ్రీనివాసులకు, చిప్ జీవి ఆంజనేయులు ఈ పదవుల వరకు ఇప్పటికే వారిని ఫిక్స్ చేసి పెట్టారు.కానీ మరి కొన్ని నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం తాత్సారం వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పోటీ ఏర్పడడం. ఇందులో జనసేన పార్టీ కూడా కొన్ని పదవుల విషయంలో పట్టు వదలడం లేదట. టిటిడి బోర్డు విషయంలో కూడా  జనసేన తీవ్రంగా పోటీపడుతోందట. ఈ బోర్డులో జనసేన కూడా మూడు పదవులు కావాలని  అడుగుతోందట.  బిజెపి ఒక పదవి అడుగుతోందట. శాసనసభ విప్ ల పదవుల విషయంలో  మొత్తం 14 మంది ఉంటారు. దీనిలో కూడా జనసేన,బిజెపి ఎక్కువ పదవులు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు పార్టీల  మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడడంతో  అధినాయకులు ఎటు తేల్చాలో తెలియక సైలెంట్ అయిపోయారట. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 450 దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో రెండు లేదా మూడు పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ఇందులో బోర్డు డైరెక్టర్లు,చైర్మన్ లను నియమించాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా అగ్రికల్చర్ మార్కెట్స్ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో రెండు  మార్కెట్స్ ఉన్నాయి.ఇలా రాష్ట్రవ్యాప్తంగా 220 కి పైగా అగ్రికల్చర్ మార్కెట్స్ ఉన్నా వీటికి కూడా చైర్మన్ లను నియమించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎండోమెంట్స్, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్ , గ్రంథాలయ చైర్మన్లు, తోడా చైర్మన్లు, సహకార సంఘాల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా నామినేటెడ్ పదవులు ఉన్నాయి.  ఈ పదవుల్లో 20 కి పైగా జనసేన కి కేటాయించాలని పార్టీ కోరుతోంది. ఇంకో 5% బిజెపి కోరుతోంది. కానీ టిడిపి మాత్రం మొత్తం కలిపి 20% రెండు పార్టీలకు ఇస్తానని అంటుంది.  దీంతో బిజెపి,జనసేనలు కలిసి చంద్రబాబు నాయుడు దగ్గర గట్టిగా అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి దీనిపైన నిర్ణయం ఎలా ఉంటుందనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: